ఉత్తర కొరియా :అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలో వున్నారా? ఉత్తర కొరియా అధ్యక్షుడికి ఉన్న కొన్ని అధికారాలను కిమ్ తన సోదరి కిమ్ యో జోంగ్ కు కట్టబెట్టారని మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్కు సహాయకుడిగా పని చేసిన చాంగ్ సాంగ్ మిన్ తమ దేశానికి చెందిన గూఢచారి వర్గాల సమాచారం ప్రకారం కిమ్ కోమాలో వున్నట్లు తెలిసిందన్నారు.
కిమ్ కోమాలో ఉన్నట్టు తాను అంచనా వేస్తున్నానని కానీ అతను మరణించలేదని ఆయన అన్నారు. ఈ ఏడాది కిమ్ బయట కనిపించింది చాలా తక్కువని, ఆయన ఆరోగ్యం క్షిణించిందని చాంగ్ తెలిపారు. ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందకు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ సిద్దంగా ఉన్నారని చాంగ్ అన్నారు.
గతంలో కూడా కిమ్ ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు చక్కర్లు కొట్టాయి. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించిందని, ప్రాణాలతో పోరాడుతున్నారని వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇపుడు కిమ్ కు నిజంగా ఏదైనా ఆపద పొంచి ఉందా లేక ప్రపంచ దేశాలను మరోసారి ఉత్తర కొరియా అధ్యక్షుడు తప్పు దారిలో పయనించేలా చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. మరిన్ని వార్తలు చదవండి.