Breaking News

కరోనా ఫ్రీగా 9 దేశాలు..!

10 th Jun 2020, UTC
కరోనా ఫ్రీగా 9 దేశాలు..!

 ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 70 లక్షలు దాటగా.. 4 లక్షల మరణాలు సంభవించాయి.అయితే కరోనా  మహమ్మారి  ఇంతగా విజృంభిస్తోన్న సమయంలో కూడ.. న్యూజిలాండ్‌తో సహా 9 దేశాలు కరోనా ఫ్రీ అని ప్రకటించుకున్నాయి. . ఆ దేశాలు ఏమిటో చూద్దాం.

1. న్యూజిలాండ్‌
జూన్‌ 8న తమ దేశంలోని చివరి కరోనా రోగి కోలుకున్నట్లు న్యూజిలాండ్‌ వైద్యాధికారులు తెలిపారు.

2. టాంజానియా
దేవుని శక్తులు తమ దేశం నుంచి కరోనాను తొలగించాయని అధ్యక్షుడు జాన్ మాగుఫులి ఆదివారం చర్చి సేవలో ప్రకటించారు

3. వాటికన్‌
12 మంది కోలుకున్న తర్వాత తమ దేశం కరోనా రహితంగా మారిందని జూన్‌ 6న వాటికన్‌ సిటి ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక్క మరణం కూడా సంభవించలేదని తెలిపింది.

4. ఫిజి
మొత్తం 18మంది కోలుకున్న తర్వాత తమ దేశం కరోనా ఫ్రీగా మారిందని దేశ అధ్యక్షుడు ప్రధాని ఫ్రాంక్ బైనీమరామ  వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ‘రోజు టెస్టుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ గడిచిన 45 రోజులుగా ఒక కేసు కూడా నమోదు కాలేదు. ఒక్క మరణం సంభవించలేదు. 100శాతం అందరు కోలుకున్నారు’ అని ట్వీట్‌ చేశారు.

5.మాంటినిగ్రో
మొదటి కరోనా కేసు గుర్తించిన 69 రోజుల తర్వాత ప్రస్తుతం తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని మాంటినిగ్రో ప్రకటించింది.

6. సిషెల్స్‌
మే 18 నాటికి కరోనా ఫ్రీగా మారినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక్కడ 11 కేసులు నమోదు కాగా.. ఒక్కరు కూడా మరణించలేదు.

7. సెయింట్ కిట్స్, నెవిస్
మే 19 న ఈ కరిబియన్‌ దీవులు కరోనా వైరస్ రహితంగా మారాయి. మొత్తం 15 మంది కోవిడ్ -19 రోగులు కోలుకున్నట్లు తెలిపాయి.
.8 టిమోర్-లెస్టె
మొత్తం 24 మంది కోలుకున్న తర్వాత మే 15న టిమోర్-లెస్టె తనను తాను కోవిడ్‌-19 రహిత దేశంగా ప్రకటించుకుంది.

9. పాపువా న్యూ గినీ
ఈ‌ దేశం మే 4న కరోనా రహిత దేశంగా ప్రకటించుకుంది. ఇక్కడ 24 కేసులు నమోదుకాగా అందరు కోలుకున్నారు. మరణాలు సంభవించలేదు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox