Breaking News

ఇజ్రాయెల్‌ తీర్దయాత్రలో తొక్కిసలాట.. 44 మంది మరణం

30 th Apr 2021, UTC

ఉత్తర ఇజ్రాయెల్‌లో శుక్రవారం యూదుల తీర్థయాత్రలో భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ సందర్బంగా 44 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. రెండవ శతాబ్దపు రబ్బీ షిమోన్ బార్ యోచాయ్ యొక్క సమాధి వద్ద మెరోన్లో ఈ విపత్తు సంభవించింది. అల్ట్రా ఆర్థోడాక్స్ యూదులు లాగ్ బామెర్ సెలవుదినం సందర్భంగా తరలివచ్చారు.

ప్రాధమిక సమాచారం ప్రకారం స్టేడియం సీటింగ్‌లో ఒక భాగం కూలిపోయినప్పుడు తొక్కిసలాట చోటు చేసుకుంది. కరోనా వైరస్ ఆంక్షల కారణంగా గత సంవత్సరం ఇది మూసివేయబడింది, ఈ సంవత్సరం తీర్థయాత్ర విజయవంతమైన టీకా ప్రయత్నానికి కృతజ్ఞతగా ప్రారంబమయినట్లు తెలుస్తోంది. సమాధి ఉన్న స్థలంలో 10,000 మంది హాజరుకావడానికి అనుమతి వుండగా 30,000 మంది యాత్రికులు వచ్చినట్లు  నిర్వాహకులు తెలిపారు.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనిని "భారీ విపత్తు" అని పిలిచారు మరియు "గాయపడినవారి కోసం ప్రార్థిస్తున్నాను" అని అన్నారు. క్షతగాత్రులను తరలించడానికి సైన్యం,  హెలికాప్టర్లను మోహరించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox