Breaking News

28 ఏళ్ల వయసొచ్చాక సర్జరీతో ఎత్తు పెరిగాడు.. ఎలా అంటే..!

20 th Jan 2021, UTC

డల్లాస్ :వయసుతో పాటు ఎత్తు కూడా పెరుగుతూ వస్తుంది. కానీ యుక్త వయసు వచ్చాక ఒక దశలో ఎత్తు పెరగదు. కండరాలు అన్ని సక్రమంగా అమరిన తరువాత ఎత్తు పెరగడం ఆగిపోతుంది. కానీ డల్లాస్​కు చెందిన అల్ఫాన్సో ఫ్లోరెస్ మాత్రం 28 సంవత్సరాల వయసులో ఎత్తు పెరిగాడు. ఇందుకోసం అతను ఒక సర్జరీని చేయించుకున్నాడు. 

తన పన్నెండవ ఏట నుంచే అల్ఫాన్సో ఫ్లోరెస్ ఆరడుగుల ఎత్తు ఉండాలని కలలు కన్నాడు. మనలో కూడా చాలా మంది ఎత్తు ఉండాలని కోరుకుంటాం. కానీ, అది అందరికి సాధ్యం అవదు కదా. కానీ అల్ఫాన్సో ఫ్లోరెస్ మాత్రం ఊరుకోలేదు. తనకు పాతికేళ్ల వయసు వచ్చిన ఎక్కువ ఎత్తు పెరగలేదు. ఐదడుగుల 11 అంగుళాలు మాత్రమే ఉన్నాడు. హైట్ పెరగాలన్న అతని ఆశ మాత్రం పెరుగుతూనే ఉంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న అవకాశాలన్నీ పరిశీలించాడు. 

లింబోప్లాస్ట్ ఇన్​స్టిట్యూట్​కు చెందిన డాక్టర్ కెల్విన్ దేబీపర్షద్ సర్జరీ ద్వారా హైట్ ను పెంచుతానని తెలపడంతో ఫ్లోరెస్ సర్జరీ చేయించుకోవాలి అనుకున్నాడు. లింబ్​-లెంథెనింగ్​ సర్జరీ ద్వారా ఎత్తు పెరిగాడు. ఈ సర్జరీలో కాలి ఎముకలను కట్ చేసి ఓ డివైజ్​ను ఇన్​సెర్ట్ చేయడం ద్వారా ఎత్తు పెంచుతారు. కొంతకాలం వీటిని అమర్చుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎముకలు సర్దుకుంటాయి. ఏడు నెలల కాలంలో ఫ్లోరెస్ ఆరడుగుల ఒక అంగుళానికి పెరిగాడు. తానూ కోరుకున్న ఎత్తు పెరగడంతో ఫ్లోరెస్ ఆనందానికి అవధులు లేవు. మొదట్లో ఈ సర్జరీకి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కానీ, ఫ్లోరెస్ వారిని కూడా ఒప్పించి సర్జరీ చేయించుకున్నాడు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox