Breaking News

2021 జనవరికి వ్యాక్సిన్ రెడీ.. కేంద్రమంత్రి హర్ష వర్దన్ 

30 th Nov 2020, UTC

ఢిల్లీ :2021 జూలై, ఆగస్ట్ నాటికి 30 కోట్ల మంది భారతీయులకు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్ష వర్ధన్ ప్రకటించారు. 2021 జనవరి నుంచి మూడునాలుగు నెలల పాటు దేశ ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించే అవకాశాలపై పూర్తిగా దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు. ఈలోపు సరిపడా వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యలతో స్పష్టమైంది. జూలై నుంచి ఆగస్ట్ లోపు దేశంలోని 25 నుంచి 30 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించాలని కేంద్రం భావిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించే విషయంలో అలక్ష్యం పనికిరాదని మంత్రి చెప్పారు. ఇండియన్ రెడ్‌ క్రాస్ సొసైటీకి చైర్మన్‌గా ఉన్న మంత్రి, డాక్టర్ హర్ష్ వర్ధన్ సోమవారం ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో మాస్క్‌లు, సబ్బులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మరిన్ని జాతీయ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox