Breaking News

మార్చి 1 నుంచి 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్

25 th Feb 2021, UTC

 మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్‌ వేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు అంతకన్నా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైవయస్కులకు కూడా వ్యాక్సిన్‌ వేస్తారు. కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ బుధవారం మీడియాతోమాట్లాడుతూ దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్‌ వేస్తామని తెలిపారు.

అయితే ప్రభుత్వ కేంద్రాల్లో  వ్యాక్సిన్ ఉచితమని, ప్రైవేటు కేంద్రాల్లో తీసుకునేవారు రుసుము చెల్లించాలని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్‌కు ఎంత మొత్తం చెల్లించాలనే విషయమై రెండు రోజుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటిస్తుందని చెప్పారు.  రెండో దశలో దాదాపు 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ప్రకాశ్‌ వెల్లడించారు.

60 ఏళ్ల పైబడిన వారు 10 కోట్ల మంది ఉంటారని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. మొదటి దశలో 1,07,67,000 మందికి వ్యాక్సినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. అమెరికా తర్వాత వ్యాక్సిన్‌ అత్యధిక మందికి వేసిన దేశంగా భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. అత్యవసర వినియోగానికి భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కోవాగ్జిన్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేసిన కోవిషీల్డ్‌ను వినియోగిస్తున్నారు
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox