Breaking News

ఢిల్లీ లో కోళ్ల దిగుమతి పై పది రోజుల నిషేధం..!

10 th Jan 2021, UTC

ప్రస్తుతం భారత్ లో బర్డ్ ఫ్లూ వణికిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న గా మొదలై, క్రమం గా పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఈ క్రమం లో, పది రోజుల పాటు బతికి ఉన్న కోళ్లను దిగుమతి చేసుకోవడాన్ని ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. అలాగే, పదిరోజులపాటు పౌల్ట్రీ మార్కెట్ ను కూడా మూసివేయనున్నారు. ఈ మేరకు అధికారులు శనివారం ప్రకటన చేసారు.

ఈ విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీ లో ఇప్పటివరకు ఒక్క ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. ఇప్పటికే జలంధర్ ప్రయోగశాలకు నమూనాలను పంపినట్లు చెప్పారు. ప్రజల సహాయం కోసం 24 గంటల హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు  అరవింద్ కేజ్రీవాల్ వివరించారు. "గత కొన్ని రోజులుగా, దేశంలోని వివిధ ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ కేసులు చాలా నమోదయ్యాయి, ఇది ఆందోళన కలిగించేది. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మరియు రాజస్థాన్లలో బర్డ్ఫ్లూ కేసులు నమోదయ్యాయి.  ఇప్పటి వరకు ఢిల్లీ లో ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదు. మేము ఇప్పటివరకు 104 నమూనాలను సేకరించాము, వీటిని ప్రయోగశాలలో పరీక్ష మరియు పరీక్ష కోసం జలంధర్‌కు పంపారు " అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశం లో వెల్లడించారు. 

ప్రతి జిల్లా అధికారులను అప్రమత్తం చేసి, వ్యాధి వ్యాపించకుండా ఉండడానికి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన వెటర్నరీ అధికారులు అన్ని పౌల్ట్రీ మార్కెట్ లలోను, నీటి వనరుల్లో కూడా సర్వేలను నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox