Breaking News

వంటింటి చిట్కాలతోనే కరోనా నుంచి కోలుకున్నారు..!

04 th Jul 2020, UTC

తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో చికిత్స పొందడం కోసం ఆయన హాస్పిటల్‌లో చేరారు.  తాజా పరీక్షల్లో  నెగటివ్ అని రిపోర్ట్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు.

హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో అలీ డాక్టర్ల సూచన మేరకు ఉదయం యోగ చేసి, పౌష్టిక ఆహారం తీసుకున్నారు. దీంతో తిరిగి పూర్తి ఆరోగ్యవంతంగా తయారయ్యారు.
ఈ సందర్బంగా ఆలీ మాట్లాడుతూ గత నెల 25వ తేదీన తన గన్‌మన్‌ తో పాటు  పేషీలో 11 మందికి జ్వరం రావడంతో 28వ తేదీన ఆస్పత్రిలో చేరానని పరీక్షలు చేయగా  పాజిటివ్‌ అని తేలిందన్నారు.వైద్యులు ఇచ్చే యాంటీబయాటిక్‌ మందులతో పాటు వంటింటి చిట్కాలు పాటించడంతో ఐదు రోజుల్లోనే తాను కరోనా నుంచి బయటపడ్డానని తెలిపారు.

తులసి ఆకులు వేసిన వేడి నీళ్లను రోజుకు నాలుగైదు సార్లు తాగిరోజూ రెండు సార్లు ఆవిరిపట్టానని ఆయన చెప్పారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రిపూట ఉడకబెట్టిన గుడ్లు.. నల్ల మిరియాలు వేసుకుని తిన్నానన్నారు. వేడి నీళ్లు... వేడిగా ఉండే ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇచ్చా. అల్లం, వెల్లుల్లిని ఎక్కువగా తీసుకున్నానని  గొంతులో ఇన్‌ఫెక్షన్‌ తగ్గడానికి ఉప్పు వేసిన నీటిని పుక్కిలించానని తెలిపారు. రాత్రి పూట పసుపు వేసిన పాలు తాగా. రోజూ ఉదయం 10 నిమిషాలు యోగాతో పాటు ఊపిరితిత్తులకు మేలు చేసే వ్యాయామాలు చేశా. ఐదు రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చి... ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యా’ అని వివరించారు.

 కరోనాను జయించిన వారిలో హైదరాబాద్ క్రైం బ్రాంచ్ అదనపు కమిషనర్‌ షికా గోయల్ ఒకరు . ఆమె కరోనాను విజయవంతంగా జయించారు . కొవిడ్‌ -19 విపత్కర పరిస్థితుల్లో వలస కూలీలు , లాక్‌డౌన్‌ అమలు కోసం ఆమె క్షేత్ర స్థాయిలో పనిచేశారు . ఆమె విధుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్‌ సోకింది .
అయితే ఐపీఎస్ కావడంతో పెద్దగా భయపడలేదు . ఇలాంటి సమయంలో ఎంత ధైర్యంగా ఉంటే అంత త్వరగా కోలుకోవచ్చని నమ్మారు . ఆమెకు ఎలాంటి లక్షణాలు లేకున్నా ఇంటికే పరిమితమయ్యారు . రోజూ పోషకాహారం తీసుకున్నారు .

షికా గోయల్ ప్రతిరోజూ ఆవిరి తీసుకునేవారు . అలాగే కొన్ని వంటింటి చిట్కాలు పాటించారు . తులసి ఆకులు , పసుపు , మిరియాలు , అల్లం నీటిలో వేడి చేసిన మిశ్రమం తీసుకున్నారు . కరోనా విషయంలో అంతగా భయపడాల్సిన పని లేదంటున్నారామె . దీన్ని ఓ సాధారణ ఫ్లూగా భావించాలని .. కాకపోతే .. నిర్లక్ష్యం చేయొద్దని సలహా ఇస్తున్నారు .

అంటే కరోనాను ఎదుర్కోవడానికి ఖరీధయిన మందులు అవసరం లేదు.. కేవలం మన వంటింట్లో వుండే వస్తువులతోనే నయం చేసుకోవచ్చు. కానీ మానసికంగా దైర్యంగా వుండాలి. .కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, ఆయన సతీమణి కూడా ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. 71 ఏళ్ల వయసులోనూ ఆయన ఆత్మస్థైర్యంతో కోవిడ్‌ను జయించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox