Breaking News

విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తే..లైసెన్స్ రద్దు చేయండి : హై కోర్ట్

13 th Aug 2020, UTC

హైదరాబాద్ :కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభిస్తున్నవేళా,తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్ట్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే,ఈ విషయమై హైకోర్ట్ లో గత కొంత కాలంగా విచారణ జరుగుతోంది. తాజాగా, కరోనా పరిస్థితులపై హై కోర్ట్ లో ఇప్పటివరకు జరిగిన సుదీర్ఘ విచారణ ముగిసింది. కరోనా విషయంలో హైకోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలను పూర్తి చేయాలనీ హైకోర్ట్ సూచించింది.

ఇప్పటి వరకు ఎన్ని చర్యలు తీసుకున్న, కరోనాను అదుపు చేయడం కోసం మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందేనని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కాంటాక్ట్ ఉన్నవారిలో ఎంతమందికి కరోనా పరీక్షలు చేసారో చెప్పాలని హైకోర్ట్ ప్రశ్నించింది. మరో వైపు ప్రైవేట్ ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రభుత్వ అనుమతుల మేరకే నడుచుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకుండా, విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తే, ఆసుపత్రుల లైసెన్స్ లను రద్దు చేయాలనీ హైకోర్ట్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం కల్పించిన వసతులను వాడుకున్న ప్రయివేటు హాస్పిటల్స్ ఎంత మందికి ఉచితంగా చికిత్స అందించారో కూడా చెప్పాలని హైకోర్ట్ ప్రశ్నించింది. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని హై కోర్ట్ ఆదేశించింది. ఎన్జీవోలు, సివిల్ సొసైటీతో సంయుక్తంగా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి రసూల్ పూర్ లోని హాకీ మైదానంను పరీశీలించాలని సూచించింది. తదుపరి విచారణ సమయానికి వైద్య అధికారులు కూడా హాజరు కావాలని తెలిపింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox