Breaking News

ఫైజర్ వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలు.. ?

12 th Nov 2020, UTC
ఫైజర్ వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలు.. ?

కరోనా మహమ్మారిని అంతమొందించడానికి వాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో, ఫైనల్స్ కు చేరుకున్న వాక్సిన్లు కొంత మేర ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఇటీవల విడుదల అయినా ప్రయోగ ఫలితాల్లో ఫైజర్ వాక్సిన్ వలన దుష్ప్రభావాలను తలెత్తినట్టు తాజాగా బయటపడింది. సాధారణం గా టీకాలు వేసుకున్నప్పుడు జ్వరం, నొప్పి, బడలిక వంటి లక్షణాలు సహజం గా వస్తాయి. అయితే ఫైజర్ వాక్సిన్ వేసుకున్నప్పుడు తలనొప్పి, విపరీతమైన హ్యాంగోవర్ ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వాలంటీర్లు చెబుతున్నారు.

ఆరు దేశాల్లో దాదాపు నలభై మూడు వేలకు పైగా వాలంటీర్లకు ఈ వాక్సిన్ ను ఇచ్చి ప్రయోగించి చూసారు. మొదటి డోస్ లో అంతగా తీవ్రమనిపించకపోయినా రెండవ డోస్ ఇచ్చిన తరువాత ఈ దుష్ప్రభావాలు కనిపించినట్లు తెలిపారు. అయితే.. టెక్సాస్ కి చెందిన ఓ వాలంటీర్ కొద్దీ సేపటి తరువాత తాను సాధారణ స్థితి కి వచ్చినట్లు తెలిపారు. ఈ వాక్సిన్ ను  మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి లో ఇండియా వంటి దేశాలకు ఈ వాక్సిన్ ను సరఫరా చేయడం కష్టతరమవుతుంది. సాధారణ రిఫ్రిజిరేటర్‌లో ఈ వాక్సిన్ ను స్టోర్ చేస్తే నాలుగైదు రోజులో నిర్వీర్యమైపోతుంది.

ఫైజర్ వాక్సిన్ సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆల్బర్ట్‌ గత సోమవారమే ఫైజర్ వాక్సిన్ ప్రభావవంతంగా పని చేస్తోందని కితాబిచ్చారు. అయితే రెండో డోస్ ఇచ్చిన వాలంటీర్లకు దుష్ప్రభావాలు ఎదురవుతుండడం గమనించారు. అయితే అమెరికా కు ఈ వాక్సిన్ ను  పంపడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడంతో ఏమి చేస్తారన్న విషయమై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox