New Delhi: దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో దేశాన్ని గడగడలాడించిన కరోనా, మళ్లీ పంజా విసరడానికి సిద్ధమవుతోంది. మన సరిహద్దు దేశమైన చైనాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా, ఇప్పుడు దేశంలో కూడా క్రియాశీలక కేసుల సంఖ్య పెరుగుతోంది. అత్యధికంగా కేరళ, మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. కొత్త కేసులు, బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 21వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24గంటల్లో నిర్వహించిన పరీక్షల్లో కొత్తగా 4,041మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అంతకు మందు రోజు 3,712 కొత్త కేసులు నమోదు కాగా, మరుసటి రోజుకి 300కి పైగా కేసులు నమోదయ్యాయి. 84 రోజుల తర్వాత దేశంలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే. మరోవైపు పాజిటివిటీ రేటు కూడా పెరుగుతోంది. తాజా కేసులతో పాజిటివిటీ రేటు ఒక శాతానికి చేరింది. కేరళలో 1,307 మంది, మహారాష్ట్రలో 1,045 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. కేవలం ఈ రెండు రాష్ట్రాల్లోనే రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
దీనిపై అలెర్ట్ అయిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. మరోసారి ఆంక్షలకు వెళ్లకూడదంటే, ఎవరికి వారు స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించడం మంచిదని సూచించింది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో కూడా కేరళ, మహారాష్ట్రలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా వ్యాప్తి జరిగింది. ఇప్పుడు మరోసారి ఈ రెండు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాల్లో ఆందోళన మొదలైంది.

Read latest ఆరోగ్య వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
22 Jun 2022
22 Jun 2022
20 Jun 2022
25 Jun 2022
25 Jun 2022