Breaking News

అమెరికాలో అరుదైన ఆపరేషన్.. మనిషికి పంది గుండే అమర్చిన వైద్యులు

11 th Jan 2022, UTC

అమెరికాలోని వాషింగ్టన్ లో మొట్టమొదటిసారిగా వైద్యులు  తొలిసారిగా అరుదైన ఆపరేషన్ చేశారు. పంది గుండెను మనిషికి అమర్చగా ఆపరేషన్ విజయవంతం అయ్యింది. మేరీల్యాండ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులు  57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి  జెనటికల్ మార్పులు చేసిన పంది గుండెను అమర్చారు.

శుక్రవారం వైద్యులు ఎనిమిది గంటల పాటు శ్రమించి ఈ ఆపరేషన్ విజయవంతం చేశారు.  ఆపరేషన్ తర్వాత రెండు రోజులు ఆ వ్యక్తిని అబ్జర్వేషన్ లో ఉండగా ప్రస్తుతం అతడు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా డాక్టర్లు అమర్చిన మంది గుండె సక్రమంగానే విధులు నిర్వహిస్తుందని తెలిపారు.

ప్రపంచంలోనే మనిషికి పంది గుండెను అవసరం ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని భవిష్యత్తులో మరికొంతమంది ప్రాణాలు ఈ ఆపరేషన్ తో నిలబెట్టవచ్చని వారు అన్నారు.అమెరికాలో ప్రతీ ఏడాది సగటున ఆరు వేల మందికి పైగా పేషెంట్లు.. గుండె మార్పిడికి ముందే చనిపోతున్నారు. అవయవాల కొరతే అందుకు ప్రధాన కారణం.  ప్రస్తుతం అమెరికాలో లక్షా పదివేల మందికి పైగా గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox