Breaking News

కరోనాకు పతంజలి సంస్ద మందు..!

23 rd Jun 2020, UTC
కరోనాకు పతంజలి సంస్ద  మందు..!

కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించే మందును బాబాపతంజలి సంస్థ తయారుచేసి విడుదల చేసింది. తాము తయారు చేసిన కోరోనిల్ వాడితే రెండు వారాల్లో కరోనానుంచి పూర్తి స్థాయిలో కోలుకుంటారని రాందేవ్ బాబా తెలిపారు.  దీని తయారీకి 150కి పైగా ఔషద మొక్కలను వాడినట్లు పతంజలి సంస్థ ప్రకటించింది.

ఈ మేరకు పతంజలి యోగ్‌పీఠ్‌‌ సహవ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. పతంజలి సంస్థ తయారుచేసిన ఔషదం 80 శాతం సక్సెస్‌ను చూపించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం మధ్యాహ్నం హరిద్వార్‌లోని పతంజలి యోగ్‌పీఠ్‌‌లో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు బాలకృష్ణ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారు

రాజస్థాన్ జైపూర్ నిమ్స్ వైద్యులతో పాటు పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో దీన్ని రూపొందించామని రాందేవ్ చెప్పారు. క్లినికల్ కంట్రోల్ స్టడీ, క్లినికల్ కంట్రోల్ ట్రయల్ చేశాకే తాము కరోనిల్ మందును మార్కెట్లో విడుదల చేశామని చెప్పారు. తమ మందు వాడిన రోగులు అందరూ వంద శాతం కోలుకున్నారని రాందేవ్ చెప్పారు.

కరోనా వ్యాక్సిన్ ను  తయారీకి పలు  ప్రపంచ దేశాలుప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే 13 రకాల వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగించారు.  మరో 120 కి పైగా సంస్థలు ఈ మందు తయారీలో నిమగ్నమయ్యాయి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox