Breaking News

ఏపీ లో సంగీతం తో కరోనా కు చికిత్స..!

31 st Jul 2020, UTC
ఏపీ లో సంగీతం తో కరోనా కు చికిత్స..!

ఆంధ్ర ప్రదేశ్ :  దేశవ్యాప్తం గా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉంది. ప్రస్తుతం అత్యధికం గా కరోనా కేసులు నమోదవుతున్న టాప్ 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఇప్పటివరకు 1.20 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. లాక్ డౌన్ ను ఎత్తేసిన తరువాత గ్రామాల్లో కూడా కరోనా వేగం గా వ్యాప్తి చెందుతోంది. అనంతపురంలో ఈ మహమ్మారి అత్యధికంగా ప్రభావం చూపుతోంది.

            ఈ పరిస్థితుల్లో అధికారులు కరోనా రోగుల్లో ఉత్సాహాన్ని నింపాలని భావించారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి క్రీడలకు, సంగీతానికి చోటు కల్పించారు. అక్కడ కేసులు ఎక్కువ సంఖ్యా లో నమోదు అవుతున్నా,వారిలో ఎలాంటి లక్షణాలు ఉండడం లేదు. దీనితో వారిని క్రీడల వైపు ప్రోత్సహించాలని భావించారు. ఈ కేంద్రాల్లో వారికి క్రీడలు, సంగీతంతో కరోనా థెరపీ అందిస్తున్నారు. ఉదయం సుప్రభాతంతో ప్రారంభించి, ఆపై రోగులు తమకు ఇష్టమైన పాటలు వినే ఏర్పాట్లు చేసారు.

          అన్ని రకాల క్రీడా ఉపకరణాలను క్రీడా సెంటర్లలో అందుబాటులో ఉంచారు. వాలీబాల్, బ్యాడ్మింటన్, క్యారమ్ ఇలా అనేక క్రీడలతో అనంతపురం జిల్లా కొవిడ్ క్వారంటైన్ కేంద్రాలు సందడిగా మారాయి. అంతే కాదు. ఈ కేంద్రాల్లో ఆన్ లైన్ లో సినిమాలు చూసే వెసులుబాటు కూడా ఉంది. ఇంటర్నెట్ సౌకర్యంతో ల్యాప్ టాప్, ప్రొజెక్టర్ కూడా ఏర్పాటు చేశారు. మరో వైపు రోగుల్లో ఆత్మవిశ్వాసం తగ్గకుండా ఉండడానికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేసారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox