Breaking News

కోవిడ్ టీకా వేసుకోవాలంటే మొబైల్ కు ఆధార్ లింక్ చేయాల్సిందేనా..?

21 st Jan 2021, UTC

భారత్ లో గుర్తింపు కార్డు ఆధార్ కు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో తెలిసిందే. తాజాగా, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ లో కూడా ఆధార్ కార్డు కీలకం కానుందని తెలుస్తోంది. మీ మొబైల్ నెంబర్ కు ఆధార్ కార్డు లింక్ చేయకుంటే.. వెంటనే లింక్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ఏడాది జనవరి 16 న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రోటోకాల్ ప్రకారం,  ఆరోగ్య సిబ్బంది, యాభై సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు తొలి ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమం లో కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలనుకునే వారు మొబైల్‌ నెంబర్‌ను విధిగా ఆధార్‌తో లింక్‌ చేయాలనీ కేంద్రం పేర్కొంది. వాక్సిన్ వేయాల్సిన వ్యక్తిని గుర్తించడం, ఆ వ్యక్తికీ ఇది వరకే వాక్సిన్ వేసారా? అన్న విషయాలను గుర్తించడం కోసం ఈ నిబంధనను విధిస్తున్నారు. వ్యక్తుల మొబైల్ నెంబర్ ను ఆధార్ తో లింక్ చేయడం ద్వారా సమాచారం భద్రం గా ఉండడం తో పాటు, వ్యాక్సినేషన్ ప్రక్రియ లో సమస్యలు ఎదురుకావని పేర్కొంది. వాక్సిన్ తీసుకునే సమయం లో కూడా ఆధార్ ను తమతో పాటు తీసుకురావాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox