Breaking News

పతంజలి మందు

23 rd Jun 2020, UTC
పతంజలి మందు
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. సగానికి పైగా జనాభాను ఇంట్లో కూర్చోబెట్టింది. ఎక్కడ అంటుకుంటుందో.. ఎలా వ్యాపిస్తోందో... క్షణాల్లో పాకిపోతుంది. రోజుకు వేలకు పై గా కేసులు నమోదు  అవుతుంటే.. వందలకు పైగా మరణాలు నమోదవుతుంటే.. ఏమి చేయాలో తేలిక అధికారులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణం లో.. శాస్త్రవేత్తలు.. ఈ మహమ్మారి కి మందు కనిపెట్టడమే పని గా అహోరాత్రాలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే దాదాపు పదమూడు రకాల వాక్సిన్లను మనుషులపై ప్రయోగించారు. దాదాపు 120 సంస్థలు ఈ మహమ్మారి కి మందు కనిపెట్టడం కోసం పని చేస్తున్నాయి.
 
                      ఈ క్రమం లో పతంజలి కూడా కరోనా కు మందు కనిపెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. వారి ప్రయత్నాలు ఫలించి పతంజలి కూడా ఓ ఆయుర్వేద ఔషధాన్ని కనుగొంది. ఈ మందుకు  "కరోనీల్" అని నామకరణం చేసారు. పంతంజలి లో కరోనా కు మందును కనుగొన్నట్లు  పతంజలి యోగ్‌పీట్‌ సహవ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. ఈ ఆయుర్వేద ఔషధం దాదాపు 80 శాతం ఫలితాలను ఇస్తోంది అని.. ఆయన ఈ సందర్భం గా తెలిపారు. అయితే.. ఈ ఆయుర్వేద ఔషధాన్ని సంబంధించి పూర్తి వివరాలు మంగళవారం మధ్యాహ్నం హరిద్వార్‌లోని పతంజలి యోగ్‌పీఠ్‌‌లో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో తెలియ చేస్తామని బాలకృష్ణ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox