Breaking News

గందరగోళంగా కరోనా వ్యాక్సీన్ ప్రకటన..!

06 th Jul 2020, UTC
గందరగోళంగా కరోనా వ్యాక్సీన్  ప్రకటన..!

ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సీన్ ఇప్పుడే మార్కెట్లోకి రాదని, కనీసం వచ్చే ఏడాది వరకూ అయినా ఆగాల్సిందేనని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ షాకింగ్ వార్త వెలువరించింది. ఇది చూసిన ప్రజలు అవాక్కయ్యారు.

భారత్‌లో కోవాక్సీన్, జికోవ్-డీ వ్యాక్సీన్లు హ్యూమన్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 140 వ్యాక్సీన్లు హ్యూమన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ‘ఏదిఏమైనా వచ్చే ఏడాది వరకూ ఈ వ్యాక్సీన్లలో ఏదీ మార్కెట్లోకి రాదు’ అంటూ శాస్త్రసాంకేతిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారిక వెబ్‌సైట్లో ప్రచురించారు. అయితే ప్రచురితమైన కాసేపటికే మళ్లీ ఈ వార్తను తొలగించారు. దీంతో ఆగస్టు నాటికి కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు.

అయితే కాసేపటికే ఈ స్టేట్‌మెంట్‌ను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎమ్‌ఆర్) ఓ ప్రకటన చేసింది. దీనిలో కరోనా వ్యాక్సీన్‌ను కచ్చితంగా ఆగస్టు 15 నాటికి అందరికీ అందుబాటులోకి తెస్తామని ఐసీఎమ్‌ఆర్ పేర్కొంది.

ప్రపంచంలోని మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ ఆగస్టు 15నాటికి విడుదల చేయాలన్నదే తమ లక్ష్యమని ఐసీఎంఆర్‌ పేర్కొంది. అయితే దీనిపై వైద్య నిపుణలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు వ్యాక్సిన్‌కు సంబంధించి తేదీని నిర్ణయించారనే పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ ప్రకటనపై ఐసీఎంఆర్‌ స్పష్టతనిచ్చింది.

వ్యాక్సిన్‌ ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసుకున్నందునే.. తదుపరి అనుమతులు ఇచ్చినట్టు తెలిపింది.దేశంలో అత్యవసర పరిస్థితిని పరిగణలోకి తీసుకొని వ్యాక్సిన్‌ను వేగంగా తీసుకురావడంలో భాగంగా అంతర్జాతీయ నిబంధలను అనుగుణంగా ప్రయోగాలు చేపడుతున్నట్టు స్పష్టం చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox