Breaking News

ఈ కిట్ ఉంటే, మీకు మీరే కరోనా టెస్ట్ చేసుకోవచ్చు..!

18 th Nov 2020, UTC

ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న కరోనాను ముందుగా గుర్తించడం వలన కొంతమేర అదుపు చేయగలుగుతున్నాం. అయితే ఇంకా చాలా చోట్ల టెస్టింగ్ కిట్ లు నాణ్యమైనవి లేకపోవడం, అందుబాటులో లేకపోవడం, ఫలితాలు ఆలస్యంగా వస్తుండడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో అందుబాటులోకి వచ్చిన కరోనా టెస్టింగ్ కిట్ల సాయంతో ఎవరికీ వారే కరోనా టెస్ట్ లు చేసుకోవచ్చు. 

'లూసిరా కొవిడ్‌-19 ఆల్‌ ఇన్‌ వన్‌ కిట్' పేరిట ఈ కిట్ అమెరికాలో అందుబాటులో ఉంది. మాలిక్యూలార్‌ యాంప్లిఫికేషన్ టెక్నాలజీ సాయంతో ఇది పని చేస్తుంది. అయితే, ఈ కిట్ ఒకసారి మాత్రమే పని చేస్తుంది. వైద్యుల సలహా మేరకే ఈ కిట్ ని వినియోగించాలి. ఈ కిట్ లో ఓ స్టెరైల్ శ్వాబ్, శాంపిల్ ను ఉంచుకునే ఓ బాటిల్, బ్యాటరీలు, త్రో బాగ్స్ ఉంటాయి. తొలుత శ్వాబ్ ద్వారా గొంతు నుంచి నమూనా సేకరించాలి. ఈ శాంపిల్ ను శాంపిల్ బాటిల్ లో ఉంచాలి. కొంత సమయం గడిచాక, ఈ కిట్ లో ఉండే ఎల్ ఈ డి ఇండికేటర్స్ రంగుని మారుస్తాయి. ఈ రంగుని బట్టి సదరు వ్యక్తిలో కరోనా ఉందా, లేదా? అన్న విషయం స్పష్టం అవుతుంది.
 
ఈ కిట్ ని వైద్యుల సూచనా మేరకే వినియోగించాలి. ఈ కిట్ ని ఎలా వినియోగించాలో కూడా వైద్యుడు వివరించాల్సి ఉంటుంది. ఈ కిట్ ద్వారా అరగంటలో ఫలితం వచ్చేస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ఎక్కువ మందికి సోకుతున్న నేపధ్యంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో, ఎవరికీ వారే కరోనా టెస్ట్ లను నిర్వహించుకోగలిగే వెసులుబాటు వస్తే, పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox