Breaking News

రోజు ఇలా చేస్తే.. గుండె జబ్బులు దరిచేరవు..!

15 th Oct 2020, UTC

ఆరోగ్యవార్తలు :సాధారణంగా ఊబకాయం ఎక్కువ ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే నోరు, దంతాలు శుభ్రంగా ఉండకపోతే కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందట. నోరు, దంతాలు శుభ్రంగా ఉండకపోతే అక్కడ ఉండే బాక్టీరియా మనం తినే ఆహార పదార్ధాల ద్వారా రక్తం లోకి వెళ్లి అక్కడినుంచి గుండెకు చేరుతుంది. అందుకే వైద్యులు కూడా నోరు, దంతాలు శుభ్రంగా ఉంటె గుండె జబ్బులు రావని చెబుతుంటారు. నిత్యం 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు బ్రష్ చేస్తే ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. 

ఇటీవల శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా అధ్యయనాల్లో ఈ విషయాన్నీ రుజువు చేసారు. దక్షిణ కొరియాలోని కొరియన్ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్సు సిస్టమ్స్  ఈ అధ్యయనాన్ని చేపట్టింది. 40 నుంచి 79 యేండ్ల మధ్య వయసు ఉన్న 1,61, 286 మందిపై దాదాపు పదేళ్ల పాటు అక్కడి శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. వారి ఎత్తు, బరువు, వారికున్న అనారోగ్య సమస్యలు, జీవన విధానం, దంతాలు, నోటి ఆరోగ్యం వంటి వివరాలను వారినుంచి సేకరించారు. వీటన్నిటిని విశ్లేషించిన తరువాత వారు ఏమి తేల్చారంటే. దంతాల ఆరోగ్యం బాగుంటే తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని చాలా వరకు నివారించవచ్చని వారు తేల్చి చెప్పారు. నిత్యం మూడు కంటే ఎక్కువ సార్లు బ్రష్ చేసుకునే వారికి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు 12 శాతం వరకు తగ్గుతాయని తెలిపారు. అలాగే ఆట్రియల్ వంటి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 10 శాతం వరకు తగ్గుతాయని తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox