Breaking News

టీ డయాగ్నోస్టిక్ మొబైల్ యాప్‌ ప్రారంభం

11 th May 2022, UTC
టీ డయాగ్నోస్టిక్ మొబైల్ యాప్‌ ప్రారంభం

Hyderabad: నార్సింగ్‌లో టి డయాగ్నోస్టిక్ మినీ హబ్‌‌ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. టీ డయాగ్నోస్టిక్ మొబైల్ యాప్‌ను కూడా మంత్రి ఆవిష్కరించారు. వైద్య పరీక్షల వివరాలను మొబైల్ యాప్‌లోనే తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు. బస్తీ ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో విప్లవాత్మకమైన చర్యలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు.  ఈ యాప్ ద్వారా మనకు దగ్గర్లో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని తెలుసుకోవచ్చని చెప్పారు. అంతేకాదు ఒక్కసారి ఆరోగ్య కేంద్రంలో చెకప్‌ చేయించుకుంటే, రెండు మూడు ఏళ్ల తర్వాత కూడా ఆ వ్యక్తి పేరు ఎంటర్ చేస్తూ మొత్తం డిటేల్స్ చూపిస్తుందన్నారు. అప్పుడు డాక్టర్లకు కూడా వైద్యం చేయడం సులభతరం అవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox