Breaking News

అస్లాంబాబా భక్తుల చేతులను ముద్దాడి కరోనా అంటించేసాడు..!

12 th Jun 2020, UTC
అస్లాంబాబా భక్తుల చేతులను ముద్దాడి కరోనా అంటించేసాడు..!

కరోనామహమ్మారితో దేశం అంతా అల్లకల్లోలంగా వుంది. అయితే మధ్యప్రదేశ్ లోని రత్లాం కు చెందిన ఒక బాబా మాత్రం  ముద్దు పెట్టుకుంటే కరోనా పోతుందంటూ ప్రచారం చేశాడు. అలా తన ఆశ్రమానికి వచ్చినవారిని ముద్దులు పెట్టేసుకున్నాడు.  అయితే  తాజాగా ఆ బాబా చనిపోయాడు . బాబా కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. దానితో ఆయతో ముద్దులు పెట్టించుకున్నవారు తమకూ  కరోనా వచ్చిందేమో అనే భయంతో..ఇప్పుడు హడలిపోతున్నారు. ఆ బాబా పేరు అస్లామ్ బాబా. అస్లాం బాబాగా ప్రచారం పొందిన అన్వర్ షా రత్లాంలో జూన్ 4న కరోనా సోకి మృతి చెందాడు.
 
ఆశ్రమానికి వచ్చిన భక్తుల చేతులను ముద్దాడిన అస్లాం బాబా వల్ల 24 మందికి కరోనా వైరస్ సోకింది. రత్నాలం జిల్లాలో మొత్తం 85 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కాగా.. వీరిలో ఒక్కరి వల్లే 19 మందికి కోవిడ్-19 సోకినట్టు డాక్టర్లు గుర్తించారు.

కరోనా బాధితుల చేతులను ముద్దాడితే వైరస్ తగ్గిపోతుందంటూ అస్లామ్ బాబా ప్రచారం చేశారు. ఈ పిచ్చి ప్రచారాన్ని నమ్మేసిన పిచ్చి జనం బాబా దగ్గరకు వచ్చేసి ముద్దులు పెట్టించేసుకున్నారు. అలా 85 మందికి బాబాగారు ముద్దులు ఇచ్చేశారు. ఆ ముద్దుల వతో పాటు కరోనాను కూడా వరంగా ఇచ్చేసారు అస్లామ్ బాబా కరోనా వైరస్‌తో చనిపోయాడు. దీంతో బాబాను కాంటాక్ట్ అయినవారిని అధికారులు గుర్తించి వారిని క్వారంటైన్‌కు తరలించారు.

వీరిలో ఆరుగురికి జూన్ 7 కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనా గురించి ప్రజల్లో అధికారులు ప్రభుత్వం ఇంతగా ప్రచారం చేస్తున్నా..ప్రజలు మాత్రం అమాయకత్వంతోనే లేక మూర్ఖత్వంతోనే అస్లామ్ బాబాను ఆశ్రయించడం గమనార్హం. దీంతో వారికి కరోనా వచ్చేసింది. కాగా..మొత్తం 85 మంది బాబాను సంప్రదించగా.. వారిలో 19 మందికి వైరస్ సోకినట్లుగా గుర్తించారు.

 అయితే బాబాను కలిసి ముద్దులు పెట్టించుకున్న వారిలో ఎక్కువమంది తమ పేర్లు ఎక్కడ బైటకొస్తాయో అనే భయంతో బాబాతో ముద్దు పెట్టుంచుకున్నవారు బైటపడటంలేదు. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారికి గనుక కరోనా సోకితే అది ఇంకా ఎంతమందికి సోకుతుందోనని భయపడుతున్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox