Breaking News

విటమిన్ డిని .. వీటితో పొందండి..

30 th Oct 2020, UTC
విటమిన్ డిని .. వీటితో పొందండి..

ఆరోగ్యం: కరోనావైరస్ మహమ్మారి సమయంలో  ఎక్కువగా చర్చకు వచ్చిన విషయం విటమిన్ డి .. ప్రజలు ఇంట్లో ఉంటున్నందున మరియు సహజ సూర్యకాంతి నుండి 'సూర్యరశ్మి విటమిన్' పొందలేకపోతున్నందున సాధారణ జనాభాలో విటమిన్ డి లోపం పెరుగుతున్న కేసులపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి, 80% కరోనా రోగులు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్లు   కొత్త అధ్యయనంలో తేలింది.

 విటమిన్ డి  లోపం  బలహీనమైన ఎముకలు, గుండె సంబంధిత వ్యాధులు, తక్కువ రోగనిరోధక శక్తి మరియు శ్వాసకోశ సమస్యలకు దారితీయవచ్చు.విటమిన్ డి-లోపం ఉన్న కరోనా  రోగులకు రక్తపోటు మరియు హృదయ సంబంధ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. వారిలో సీరం ఫెర్రిటిన్ మరియు ట్రోపోనిన్ స్థాయిలు పెరిగి  ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండిపోవడానికి కారణం విటమిన్ డి లోపమే..సహజంగా ఈ విటమిన్ పొందటానికి సూర్యరశ్మిని   మాత్రమే కాకుండా, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం కూడ ఎక్కువగా తీసుకోవలసి వుంటుంది.

కొవ్వు ఎక్కువగా వుంగే ట్యూనా, సాల్మన్, మరియు మాకేరెల్ చేపలను ఆహారంలో తీసుకుంటే  విటమిన్ డి శరీరానికి అందుతుంది.  పాలు, జున్ను మరియు ఇతర పాల ఉత్పత్తులను రోజువారీ ఆహారంలో చేర్చాలి.కొవ్వు అధికంగా ఉంటుందనే భయంతో చాలా మంది కోడిగుడ్ల నుండి సొనలను తీసేస్తారు.  అయితే గుడ్డు సొనలు మంచి పరిమాణంలో విటమిన్ డి కలిగి ఉంటాయి

 రోజువారీ బ్రేక్ ఫాస్ట్ లో తృణధాన్యాలు మరియు వివిధ పండ్ల రసాలను చేర్చడం వలన కూడ విటమిన్ డి ని పొందవచ్చు.పుట్టగొడుగులు  విటమిన్ డి  పోషకాలనుఅందిస్తాయి.   వీటిని  అల్పాహారం, భోజనం,  స్నాక్స్ లలో వాడితే  చాల మంచిది.  కరోనా నేపధ్యంలో పలువురు ఇటీవల  విటమిన్ టాబ్లెట్లకోసం మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు. వాటికంటే విటమిన్ పోషకాలు వున్న ఆహారాన్ని తీసుకుంటే ఎంతో ఉపయోగముంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.  మరిన్ని ఆరోగ్య వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox