Breaking News

జూలై 5 తరువాత ప్రతి ఆదివారం లాక్ డౌన్.. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

28 th Jun 2020, UTC

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని  కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. . జూలై 5వ తేదీన ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ముగియగానే.. కట్టుదిట్టమైన నిబంధనలతో లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ప్రణాళిక రచించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప నేతృత్వంలో శనివారం సాయంత్రం ప్రత్యేక సమావేశంలో చర్చించారు.

పె. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉంటుందని సీఎం యడియూరప్ప చెప్పారు. ప్రతిరోజు రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు. వారంలో ఐదురోజులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.

ఆదివారం అత్యవసర సేవలు మినహా మొత్తం బంద్‌ అని ప్రకటించారు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, బస్సులతో పాటు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదన్నారు. నేడు ఆదివారం లాక్‌డౌన్‌ ఉండదు. కానీ రాత్రి నుంచి కర్ఫ్యూ నిబంధన అమల్లోకి వస్తుంది. జూలై 5 వరకు ఇప్పుడున్న నిబంధనలే కొనసాగుతాయని తెలిపారు.

కర్ణాటకలో  గత మూడు రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 11,923 ఉండగా, ఒక్క బెంగళూరులోనే  కొత్తగా 569 కేసులు నమోదయ్యాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox