Breaking News

విజృంభిస్తున్న ఎబోలా వైరస్.. ఆరు దేశాలను అలెర్ట్ చేసిన డబ్ల్యూహెచ్ఓ..!

19 th Feb 2021, UTC

కరోనా పీడా వదిలింది అనుకుంటే మరో మహమ్మారి ఎబోలా వైరస్ ప్రతాపం చూపించడం మొదలైంది. ఆఫ్రికా దేశాల్లో ఈ మహమ్మారి హెచ్చు స్థాయిలో విజృంభిస్తోంది. ఆఫ్రికాలోని గినియాలో ఈ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మృతి  చెందారు. అయితే, ఈ మహమ్మారి కూడా త్వరితంగా వ్యాప్తి చెందుతోంది. హెచ్చు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఆఫ్రికాతో పాటు మరో ఆరు దేశాలను ఈ మహమ్మారి విషయంలో అలెర్ట్ గా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కూడా జారీ చేసింది.

ఈ మహమ్మారి సోకిన వారికి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వాంతులు, విరేచనాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎబోలా సోకితే వారికి శరీరం లోపల, బయటకు కూడా రక్తస్రావం జరుగుతుందట. ఆ తరువాత ప్రాణాలు నిలవడం కష్టమవుతుంది. ఎబోలా సోకిన వారిలో ప్రాణాలను దక్కించుకునే అవకాశం కేవలం పది శాతం మందికి మాత్రమే ఉంటోంది. మరో వైపు ఆఫ్రికాలోని పలు దేశాల్లో ముందస్తు జాగ్రత్తగా ఎబోలా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox