Breaking News

గుండె సమస్యలా..? ఇవి తినండి.!

10 th Jun 2020, UTC
గుండె సమస్యలా..? ఇవి తినండి.!
ఒక్కప్పటి రోజులకన్నా... ప్రస్తుతం మానవ జీవన శైలి భిన్నం గా ఉంది. తగినంత నిద్ర ఆహారం లేకపోవడం, పని ఒత్తిడి, టెన్షన్లు..ఉరుకుల పరుగుల జీవితాలతో.. మానవ శరీరం పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఫలితం గా చిన్న వయసులోనే రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. గుండె మీద ఎక్కువ వత్తిడి పెరుగుతుండడం తో గుండె జబ్బులు రావడానికి కారణం అవుతోంది. 
 
      దీనితో.. చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయి.. ముప్పై ఏళ్ళు దాటేసరికి ఆరోగ్య రీత్యా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనారోగ్యాలు వెంటాడుతున్నాయి. సరైన, సమతుల్యమైన ఆహరం తీసుకోకపోవడమే ఇందుకు కారణం అని  నిపుణులు చెబుతున్నారు. అయితే.. అనారోగ్యాన్ని రాకుండా అరికట్టాలంటే.. మనం తీసుకునే ఆహరం లో సమతుల్యత ఉండాలి.. పోషక పదార్థాలు ఉండాలి.. తప్పని సరిగా మనం తీసుకునే ఆహరం లో బీన్స్ ఉండాలని ఆరోగ్య నిపుణుల మాట.
 
       వారంలో కనీసం నాలుగు రోజులపాటు తప్పనిసరిగా బీన్స్ తీసుకోవాలి. బీన్స్ లో ఎన్నో రకాల పోషక పదార్ధాలు ఉన్నాయి.ఐరన్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. బీన్స్ ను ఉడికించి తీసుకుంటే శరీరంలోని 10శాతం కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఇక బరువు తగ్గాలి అనుకునేవాళ్ళు రోజు ఆహారంలో బీన్స్ ను తీసుకుంటే బరువు తగ్గుతారు. ఇందులోని కార్బో హైడ్రేడ్స్ కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుంది.  ముఖ్యం గా బీన్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఇది జీర్ణసంబంధమైన వ్యాధుల నుంచి బయటపడేందుకు ఉపయోగపడుతుంది. అన్ని సీజన్స్ లో కూడా బీన్స్ తక్కువ ధరకు దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox