Breaking News

తాలిబన్ల ఎఫెక్ట్ .. భారత్ లో పెరిగిన డ్రై ఫ్రూట్స్ ధరలు

20 th Aug 2021, UTC

తాలిబన్లు  ఆఫ్ఘనిస్తాన్‌ ను స్వాధీనం చేసుకున్న నేపధ్యంలో పండుగ సీజన్‌కు ముందు భారతదేశంలో విక్రయించే డ్రై ఫ్రూట్స్ ధరలు పెరిగాయి. ఇంతకీ  భారత్ లో డ్రై ఫ్రూట్స్ కు తాలిబన్లకు సంబంధమేమిటి?   భారత్ ఆఫ్గనిస్తాన్ నుంచి  డ్రై ఫ్రూట్స్ ను  దిగుమతి చేసుకుంటుంది. తాజా పరిస్దితుల నేపధ్యంలో దిగుమతులు నిలిచిపోయాయి.

తాలిబన్లు భారతదేశంతో అన్ని దిగుమతులు మరియు ఎగుమతులను నిలిపివేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ ( ఎఫ్ఐఈవొ) డైరెక్టర్ జనరల్  డాక్టర్ అజయ్ సహాయ్ చెప్పారు. భారతదేశం తన 85 శాతం డ్రై ఫ్రూట్‌లను ఆఫ్ఘనిస్తాన్  నుంచి దిగుమతి చేసుకుంటుంది.ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల కారణంగా రాబోయే రోజుల్లో డ్రై ఫ్రూట్ ధరలు పెరుగుతాయని  ఎఫ్ఐఈవొ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై అజయ్ సహాయ్ మాట్లాడుతూ మేము ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై నిఘా ఉంచాము. అక్కడి నుండి దిగుమతులు పాకిస్తాన్ రవాణా మార్గం ద్వారా వస్తున్నాయి. ప్రస్తుతానికి, తాలిబాన్ పాకిస్తాన్‌కు సరుకు రవాణాను నిలిపివేసింది, కాబట్టి దిగుమతులు  ఆగిపోయాయని అన్నారు.గత కొన్ని రోజులుగా  బాదం, వాల్‌నట్, నేరేడు పండు ధరలు రెండింతలు మరియు మూడు రెట్లు పెరిగాయి.

ఆఫ్ఘనిస్తాన్‌ సంక్షోభం ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది.  బాదం, పిస్తాపప్పు మరియు నేరేడు పండు దిగుమతుల్లో అంతరాయం ఏర్పడడంతో జమ్మూలోని డ్రై ఫ్రూట్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. తత్ఫలితంగా, డ్రై ఫ్రూట్స్ ధరలు భారీగా పెరిగాయి2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆఫ్ఘనిస్తాన్‌తో భారతదేశ దిగుమతి బిల్లు రూ. 3,753.47 కోట్లు, ఇందులో రూ .2,389.86 కోట్లు డ్రై ప్రూట్స్ వే కావడం విశేషం.

ఎండుద్రాక్ష, వాల్‌నట్స్, బాదం, అత్తి పండ్లు, పైన్ గింజలు, పిస్తా, ఎండిన ఆప్రికాట్ మరియు నేరేడు పండు, చెర్రీ, పుచ్చకాయ మరియు కొన్నిఔషధ మూలికలు  భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటోంది.ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ ఎగుమతుల్లో టీ, కాఫీ, మిరియాలు మరియు పత్తి, బొమ్మలు, పాదరక్షలు మరియు అనేక ఇతర వినియోగ వస్తువులు ఉన్నాయి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox