Breaking News

సీరమ్ ఇనిస్టిట్యూట్ కు షోకాజ్ నోటీసులు పంపిణి డిసిజిఐ..!

10 th Sep 2020, UTC

న్యూఢిల్లీ :లండన్ లో ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ ట్రయల్స్ లో ఓ వాలంటీర్ కు సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో అన్ని దేశాలలోను వాక్సిన్ ట్రయల్స్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు  ఆస్ట్రాజెనికా సీఈఓ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో ఇండియా లో సీరం ఇన్స్టిట్యూట్ కూడా ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ పై ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీరం ఇన్స్టిట్యూట్ మాత్రం ట్రయల్స్ కొనసాగుతున్నాయని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపధ్యంలో డిసిజిఐ సీరం ఇన్స్టిట్యూట్ కు షోకాజ్ నోటీసులు పంపించింది. ఇప్పటివరకూ జరిగిన ట్రయల్స్, వాటి ఫలితాల వివరాలను, వాలంటీర్లకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్ లను గురించిన సమగ్ర సమాచారాన్ని అప్పజెప్పాలని డిసిజిఐ సీరం ఇన్స్టిట్యూట్ ని కోరింది. లండన్ లో ఈ వాక్సిన్ ను తీసుకున్న ఓ మహిళా వాలంటీర్ ను నరాలకు సంబంధించిన వ్యాధి వచ్చింది. దీనితో..బ్రిటన్ తో పాటు దక్షిణ అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఈ వాక్సిన్ తాలూకు ట్రయల్స్ ను నిలిపివేశారు. ఆ వాలంటీర్ ప్రస్తుతానికి కోలుకున్నారు. కానీ ఆమెకు కనిపించిన లక్షణాలు వాక్సిన్ కారణంగానేనా, కాదా? అన్న సంగతి తేలాల్సి ఉంది. పూర్తి స్థాయిలో సమీక్షా జరిగిన తరువాతనే  తిరిగి ట్రయల్స్ ను ప్రారంభించే  విషయమై స్పష్టత ను ఇస్తామని ఆస్ట్రాజెనికా సీఈఓ స్పష్టం చేసారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox