Breaking News

ఎస్ బీ ఐ రిటైర్డు ఉద్యోగులకు కోవిడ్ బీమా

13 th Sep 2020, UTC

కరోనా: దేశీయ బ్యాంకు  దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కోసం కొత్త బీమా పథకం ప్రవేశపెట్టింది. ఇందులో కోవిడ్-19 చికిత్స కూడా చేర్చారు.మెడికల్ బెనిఫిట్స్ స్కీమ్ కింద క్రానిక్ ఒబెస్ట్రుక్టీవ్ పల్మనరీ డిసీజెస్ (సీఓపీడీ)  లేదా  ఉబ్బసం సహా మరో నాలుగు వ్యాధులతో బాధపడే వారు సైతం ఆసుపత్రిలో చేరేందుకు బ్యాంక్ అనుమతించింది.

ఇంట్లో కోవిడ్-19 చికిత్సకు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఈ పథకంలో సభ్యులకు గృహ చికిత్స కోసం రూ. 25000 వరకు ఖర్చును అనుమతించాలని నిర్ణయించింది. దీంతో కోవిడ్ కోసం అదనంగా మరో బీమాను కొనుగోలు చేయనవసరం లేదని పేర్కొంది. స్టేట్ బ్యాంక్ తీసుకున్న ఈ చర్య సంస్థ రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరటనివ్వనుంది.ఎస్‌బీఐ ప్రస్తుత ఉద్యోగులు ఇప్పటికే కోవిడ్ -19 చికిత్స  కవరేజ్ పరిధిలో ఉన్నారు. మరిన్ని ఆరోగ్య వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox