Breaking News

దేశంలో 24 గంటల్లో 97,570 కరోనా పాజిటివ్‌ కేసులు

13 th Sep 2020, UTC

న్యూఢిల్లీ :గడిచిన 24 గంటల్లో భారత్‌లో అత్యధికంగా 97,570 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 46,59,984 కు చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో కరోనా బారినపడ్డవారిలో ఇప్పటివరకు 36 లక్షల మంది కోలుకున్నారని తెలిపింది. ప్రతిరోజూ 70 వేలకు పైగా కోవిడ్‌ బాధితులు కోలుకుంటున్నారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 10,71,702 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని, మొత్తం పరీక్షల సంఖ్య 5,62,60,928 చేరిందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది.
 
తెలంగాణలో కొత్తగా 2,216 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,57,096 కి చేరింది. వైరస్‌ బాధితుల్లో కొత్తంగా 11 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 961 కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,603 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,24,528 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox