Breaking News

హెల్త్ ఇన్సూరెన్స్ పై ప్రజల చూపు ఇన్సూరెన్స్ లో ఫైర్, హెల్త్ లదే అగ్రస్దానం

24 th Sep 2020, UTC

కోవిడ్ -19 దేశంలో ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తెచ్చింది. ఇంతవరకు హెల్త్ ఇన్సూరెన్స్ కు దూరంగా వున్న ప్రజలు ఈ దిశగా ఆలోచించడం మొదలు పెట్టారు. గతంలో ఎన్నడూ  లేని విధంగా ఈ ఏడాది హెల్త్ ప్రీమియంలు భారీగా నమోదయ్యాయి. ఆగష్టులో అగ్ని ప్రమాదాలకు, ఆరోగ్య  భీమాకు సంభందించి  జనరల్ ఇన్పూరెన్స్ కంపెనీలో ఎక్కువగా ప్రీమియంలు నమోదయినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో లాక్ డౌన్, వ్యాపార , ఉపాధిరంగాలు దెబ్బతినడంతో వాటి ప్రభావం వాహన భీమాలపైనా పడింది. జనరల్ ఇన్పూరెన్స్ కౌన్సిల్ తెలిపిన వివరాల ప్రకారం నాన్ లైఫ్ కేటగిరీలో ప్రీమియంలు ఆగష్టులో 10 శాతం మేర అంటే రూ.17,360 కోట్ల వరకూ పెరిగాయని తెలుస్తోంది.

ఆగష్టులో ఫైర్ ప్రీమియంలు 29 శాతం అనగా రూ.1,180 కోట్ల రూపాయల మేరకు పెరగ్గా హెల్త్ ప్రీమియం లు రూ4,490 కోట్లకు పెరిగాయి. నాన్ లైఫ్ లో కీలకమైన మోటార్ ప్రీమియంలు మాత్రం గత ఆగష్టుతో పోల్చితే ఈ ఏడాది 2 శాతం తగ్గిపోయాయి. పంటల బీమాకు సంబంధించి ఆగష్టులో రూ.5,300 కోట్ల ప్రీమియంలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 11 శాతం ఈ రంగంలో అదనపు ప్రీమియంలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం మీద బీమా రంగం ఆగష్టునాటికి 3.6 శాతం వృద్దితో రూ.73,970 కోట్ల రూపాయల ప్రీమియం నమోదు చేసింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox