Breaking News

ఈ మాస్కుధర రూ3 వేలు

27 th Jun 2020, UTC
ఈ మాస్కుధర రూ3 వేలు

ప్రపంచమంతా కరోనా కల్లోలమే. దేశాల కతీతంగా ఈ మహమ్మారి మనుషుల ప్రాణాలను తీయడమే కాకుండా ఆర్దిక వ్యవస్దలను కూడ నాశనం చేసింది. ఇటువంటి సమయంలో మాస్కు లేనిదే మనిషి ఉనికే ప్రమాదంలో పడుతుందని అందరూ హెచ్చరిస్తున్నారు. జపాన్‌కు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ . ఇంటర్నెట్‌తో అనుసంధానమయ్యే ‘స్మార్ట్‌ మాస్కు’ను తయారు చేసింది.

 మహమ్మారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కు ధరించడం తప్పనిసరి కావడంతో స్మార్ట్‌ మాస్కును రూపొందించినట్టు డోనట్‌ రోబోటిక్స్‌ సీఈఓ తైసుకే ఓనో తెలిపారు. రోబో తయారీకి ఏళ్లపాటు కృషి చేశామని, ఆ టెక్నాలజీ సాయంతోనే దీన్ని తయారు చేశామని చెప్పారు. తెల్లని ప్లాస్టిక్‌తో తయారైన స్మార్ట్‌ మాస్కును సీ-మాస్కుగా వ్యవహరిస్తామని అన్నారు.

ఇది బ్లూటూత్‌ ద్వారా మొబైల్‌ యాప్‌తో కనెక్ట్‌ అవుతుందని తైసుకే తెలిపారు. సీ-మాస్కు ద్వారా మన ఆదేశాలతో మొబైల్‌ యాప్‌ మెసేజ్‌లు పంపడం, కాల్స్‌ చేయడం, మాటల్ని టెక్స్ట్‌ రూపంలోకి మార్చుతుందని అన్నారు. మాస్కు ధరించిన వ్యక్తి చిన్నగా మాట్లాడినా దానిని శబ్ద తీవ్రతను యాప్‌ అధికం చేస్తుందన్నారు.

జపాన్‌ భాష నుంచి 8 ఇతర భాషల్లోకి సీ-మాస్కు ద్వారా యాప్ పదాల్ని‌ తర్జుమా చేస్తుందని అన్నారు. ఒక నాణ్యమైన మాస్కుపైన సీ-మాస్కు అమర్చబడి ఉంటుందని తైసుకే తెలిపారు. జపాన్‌ మార్కెట్లోకి వచ్చే సెప్టెంబర్‌ నాటికి 5000 యూనిట్లు పంపిస్తామని అన్నారు. అమెరికా, చైనా, యూరప్‌లలో వీటిని ఆదరిస్తారనే నమ్మకముందన్నారు.  ఈ సీ-మాస్కు ధర రూ.3 వేలు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox