Breaking News

ఒక్కరోజుకు రూ.1.15 లక్షల బిల్లు కరోనా చికిత్సలో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం

05 th Jul 2020, UTC

హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రి యాజమాన్యం ఒక్క రోజు కరోనా చికిత్సకు వేసిన బిల్లు ఎంతో తెలుసా... కేవలం లక్షా పదిహేనువేల రూపాయలు మాత్రమే. ఇది వ్యాధి పట్ల ఏ మాత్రం అవగాహన లేని, నిరక్షరాస్యుల నుంచి వసూలు చేసిందనుకుంటే పొరపాటే. ఇక్కడ బాధితురాలు కూడ వైద్యురాలే. దీనకి సంబంధించి వివరాలివి..

 ఫీవర్‌ ఆసుపత్రి డీఎంవో డాక్టర్‌ సుల్తానా కరోనా లక్షణాలతో తుంబే ఆసుపత్రిలో చేరారు. అయితే  ఒక రోజు గడిచిన తరువాత తన చికిత్సకు సంభందించి బిల్లు అడిగితే ఆసుపత్రి వర్గాలు లక్షా పదిహేను వేల రూపాయలు అని చెప్పారు. ఇదేమిటని ప్రశ్నిస్తే చికిత్సకు అయిన ఖర్చు ఇంతే నంటూ చెల్లించి తీరాలని చెప్పారు. దీనితో ఆమె తన సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసారు.

బిల్లులపై ప్రశ్నించినందుకు సరైన వైద్య సేవలందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. తనతోపాటు తన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారని ఆమె రోదిస్తూ చెప్పారు. కరోనా క్లిష్ట సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా సేవలందించిన తన పట్ల తుంబే ఆస్పత్రి సిబ్బంది  ఇలా వ్యహరించడం సరికాదన్నారు.

సుల్తానా కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరితే లక్షకు పైగా బిల్లు వేశారని విమర్శించారు. సుల్తానాను సత్వరమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, తుంబే ఆస్పత్రి గుర్తింపును రద్దు చేయాలని కోరారు.

కరోనా బాధితులకు చికిత్స విషయంలో  ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీకి రంగం సిద్ధం చేశాయి. జనరల్‌ వార్డులనే ప్రత్యేక వార్డులుగా మార్చి బిల్లులు వసూలు చేస్తున్నాయి.శానిటైజేషన్‌, వైద్య సిబ్బంది పీపీఈ కిట్ల వ్యయాన్ని కూడా పేషంట్లపైనే వేయడంతో బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox