Breaking News

5 రాష్ట్రాలు, 4 నగరాల్లో కోవిడ్ -19 జోరు

01 st Aug 2020, UTC

న్యూఢిల్లీ : దేశంలోని ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, ఒడిశా, కేరళలలో కోవిడ్ -19కేసులు వేగంగా పెరుగుతున్నాయి.ఈ రాష్ట్రాల్లో వైద్య స‌దుపాయాల స‌క్ర‌మంగా లేకపోవడంతో బాధితుల‌కు తగిన చికిత్స అందడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కేసుల వృద్ధి రేటు 9.3శాతం కాగా, బీహార్‌లో ఇది 6.1శాతం, కర్ణాటక, ఒడిశా కేరళలలో 5శాతానికి మించి కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో లక్ష జనాభాకు 145పడకలు అందుబాటులో ఉండగా, కేరళలో 254పడకలు అందుబాటులో ఉన్నాయి. లక్ష జనాభాకు కర్ణాటకలో 392పడకలు ఉన్నాయి. బీహార్‌లో లక్ష జనాభాకు 26పడకలు, ఒడిశాలో 56పడకలు మాత్రమే ఉన్నాయి. లక్ష జనాభాకు పడకల సగటు దేశవ్యాప్తంగా 137.6శాతంగా ఉంది. బీహార్, ఒడిశాల‌లో పరిస్థితి ఆందోళనక‌రంగా మారింది. 

ఈ రాష్ట్రాల్లో తక్కువ సంఖ్య‌లో పరీక్షలు జ‌రుగుతుండ‌గా, కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో జాతీయ సగటుకంటే తక్కువ పరీక్షలు జ‌రుగుతున్నాయి. బీహార్ అతి తక్కువ పరీక్షల‌ రేటు ఉంది. ఇక్క‌డ ప్ర‌తి వెయ్యిమందిలో న‌లుగురికే పరీక్షలు జ‌రుగుతున్నాయి. 

దేశంలో ప్రస్తుతం హైదరాబాద్‌, పుణే, థానే, బెంగళూరు నగరాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, అక్కడ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ అన్నారు. అదే సమయంలో ఢిల్లీ వేగంగా కోలుకుంటోందని, 89శాతం రికవరీ రేటుతో అది దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని  ఆయన తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox