Breaking News

వాతావరణంలో మార్పుల కారణంగా కొత్త వ్యాధులు

30 th Apr 2022, UTC

Washington: వాతావరణంలో మార్పుల కారణంగా 2070 నాటికి కొత్త వైరస్‌లు వేలాదిగా పుట్టుకొస్తాయని, పర్యవసానంగా జంతువుల నుంచి మనిషికి సోకే అంటువ్యాధుల ముప్పు పెరుగుతుందని తాజా పరిశోధన హెచ్చరించింది. ఇప్పటికే ఫ్లూ, హెచ్‌ఐవీ, ఎబోలా, కరోనా వైరస్‌తోపాటు, మనిషి నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనిషికి అంటువ్యాధులు ఎక్కువగా సోకుతున్న ఆఫ్రికా, ఆసియా ప్రాంతాలకు ఈ ముప్పు తప్పకపోవచ్చని అభిప్రాయపడింది.

వచ్చే 50 ఏళ్లలో ప్రపంచ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగితే, 3 వేలకు పైగా క్షీరద జాతుల్లో వైరస్‌ల సంక్రమణ ఏవిధంగా ఉంటుందన్నది పరిశోధకులు ప్రత్యేక నమూనా ద్వారా పరిశీలించారు. అప్పటికి క్షీరదాల మధ్య వైరస్‌లు 4వేల సార్లు వ్యాప్తి చెందుతాయని, ఇవి మనుషులకు సోకే ప్రమాదం కూడా ఉంటుందని అంచనాకు వచ్చారు. పక్షుల్ని, సముద్ర జీవుల్ని ఈ  అధ్యయనం నుంచి మినహాయించారు. ప్రపంచం ముందున్న ముఖ్య సమస్యలైన వాతావరణ మార్పు, అంటువ్యాధుల వ్యాప్తి కలిసి ఎలాంటి ముప్పు తీసుకొస్తాయన్నది అంచనా వేసేందుకు ఈ పరిశోధన సాగించినట్టు జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ పరిశోధన కర్త కొలిన్‌ కార్ల్‌సన్‌ తెలిపారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox