Breaking News

ఢిల్లీ లో అతిపెద్ద కోవిడ్‌ సెంటర్‌ ప్రారంభం

05 th Jul 2020, UTC

 ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్‌ సెంటర్‌ను ఢిల్లీ లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఆదివారం ప్రారంభించారు. దేశ రాజధానిలో కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో 10 వేల బెడ్స్‌ సామర్థ్యం గల కోవిడ్‌ కేంద్రం నిర్మాణాన్ని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అనుకున్న సమయంలోనే  పూర్తి చేశారు.  . దీనికి ‘సర్దార్‌ పటేల్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌’ అని పేరు పెట్టారు.

 దక్షిణ ఢిల్లీ సమీపంలోని చత్తర్‌పూర్‌ ఆధ్యాత్మిక క్షేత్రం రాధాస్వామి సత్సంగ్‌ బియాస్‌ కాంప్లెక్స్‌నే ఈ తాత్కాలిక కరోనా ఆస్పత్రిగా మార్చాతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 1700 అడుగుల పోడవు, 700 అడుగుల వెడల్పున్న ఈ కేంద్రం దాదాపు 20 పుట్‌బాల్‌ మైదానాలను సమానమైన స్థలంలో నిర్మితమై ఉంది.

చైనాలో నిర్మించిన కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రికి ఇది పదింతలు పెద్దది .ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేసింది. దీనిలో మొత్తం నాలుగు విభాగాలు ఉండగా ఒక్కొక్క దానిలో 250 పడకలు ఉంటాయి. వాటిలో ఒక విభాగంలో ఆక్సిజన్, ఐసీయూ సౌకర్యాలు ఉంటాయి. ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్(ఐటీబీపీ)‌ విభాగానికి చెందిన వైద్య సిబ్బంది ఈ ఆసుపత్రిలో పనిచేస్తారు. ఈ మేరకు అజిల్‌ బైజాల్‌ ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ఈ కోవిడ్‌ కేంద్రాన్ని ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు పరిశీలించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox