Prime9

Best Fruits for health: ఆరోగ్యంగా కలకాలం ఉండాలన్నా, ఎక్కువకాలం జీవించాలన్నా ఈ పండ్లను తినండి

Best fruits for good health: ఆరోగ్యమే మహాభాగ్యం.. మన సమాజంలో ఈ నానుడికి ఎంతో ప్రాముఖ్యత సంచరించుకుంది. ఎందుకంటే మనిషి సంతోషంగా జీవించాలంటే అందుకు ఆరోగ్యం సహకరించాల్సిందే. అందుకు ఆహారపు అలవాట్లు ఎంతగానో ఉపయోగకరం. అందులో భాగంగానే ఇప్పుడు ఆరోగ్యాన్ని పెంపొందించుకునే పళ్ల గురించి తెలుసుకుందాం.

 

 

ఇప్పుడు మనం మాట్లాడుకునే వాటిలో యాపిల్స్, డార్క్ చాక్లెట్లు, ద్రాక్షా వంటివి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మంచి ఆరోగ్యం లభించాలన్నా అనారోగ్యాన్ని ఎదుర్కునే రక్షణ కవచాన్ని తయారు చేసుకోవాలన్నా ఇవితప్పక తినాల్సిందేనని అంటున్నాయి నివేదికలు. అయితే వీటిని తీసుకోవడం ఎంత ముఖ్యమో వాటితో ఎలాంటి ప్రయాజనాలో ఇప్పుడు చూద్దాం. బెర్రీలు, డార్క్ చాక్లెట్ మరియు యాపిల్స్ తీవ్రమైన ఆనాగ్యం రాకుండా సహాయపడతాయని పలు అధ్యాయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు కారణం అందులో అధికంగా ఫ్లేవనాయాడ్లు ఉండటమే.

 

 

ఫ్లేవనాయిడ్లు అనేవి సహజంగా ఉండే పదార్థాలు (Natural compounds). ఇవి ప్రధానంగా పండ్లు, కూరగాయలు, మొక్కలు, టీ, దాల్చిన చెక్క, ద్రాక్ష, కాకావ్, పుదీనా వంటి వాటిలో కనిపిస్తాయి. ఇవి పెరుగు, రంగు, రుచి అందించడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.  ఇవి ఒక రకమైన “పాలీఫినాల్స్ (Polyphenols)” అనే విభాగానికి చెందుతాయి. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది.

 

 

బెర్రీలు, డార్క్ చాక్లెట్ మరియు యాపిల్స్, టీ వంటి ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉన్న  ఆహారాన్ని తినే వ్యక్తులు ఎక్కువ కాలం జీవించవచ్చని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉన్న పళ్లు తీసుకోవడం వలన టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు (CVD) మరియు నాడీ సంబంధిత రుగ్మతలు వంటి వ్యాధులను నివారించవచ్చు. టీ, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, నారింజ, ఆపిల్, ద్రాక్ష మరియు డార్క్ చాక్లెట్ మరియు రెడ్ వైన్ వంటి మొక్కల ఆహారాలలో కూడా ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. రోజుకు 500 mg ఫ్లేవనాయిడ్ తీసుకోవడం వల్ల అన్ని రకాల అనారోగ్యాలనుంచి రక్షణ లభిస్తుంది. అలాగే, టైప్ 2 డయాబెటిస్ మరియు శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది.

Exit mobile version
Skip to toolbar