Breaking News

కరోనా టెస్టింగ్ కిట్లు నిఖార్సైనవేనా..?

13 th Nov 2020, UTC
కరోనా టెస్టింగ్ కిట్లు నిఖార్సైనవేనా..?

దేశ ప్రజల్లో కరోనా మహమ్మారి పై భయం ఇంకా పోలేదు. పాజిటివ్ రిజల్ట్ వస్తే మానసికంగా క్రుంగి పోతున్న వారు ఉన్నారు. కొందరైతే ఏకంగా ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. ధైర్యంగా పోరాడాల్సింది పోయి మానసిక వేదనకు గురి అవుతున్నారు. ఈ పరిస్థితిల్లో, కరోనా నిర్ధారణ పరీక్షల్లోని ఖచ్చితత్వం పట్ల అందరికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెగటివ్ వచ్చిన వారికి పాజిటివ్ గా చూపించినా, పాజిటివ్ వచ్చిన వారికి నెగటివ్ చూపించినా వచ్చే నష్టం ఊహించవచ్చు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి కూడా పాజిటివ్ రిజల్ట్ చూపించినా సంగతి తెలిసిందే. అయితే ఆయన మాములుగా మెడికేషన్ ప్రారంభించారు. రెండు రోజులైనా ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో మరో సారి టెస్ట్ చేయించుకున్నారు. అపుడు నెగటివ్ వచ్చింది. అయిన అనుమానం తీరక మరొక ల్యాబ్ లో కూడా టెస్ట్ చేయించుకున్నారు. అక్కడ కూడా నెగటివ్ రావడంతో, మొదట ఎక్కడ చేయించుకున్నారో అక్కడ మరొకసారి చేయించుకున్నారు. మూడు చోట్ల ఆయనకు నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. మొదటి సారి ఫాల్టీ టెస్టింగ్ కిట్ వలెనే పాజిటివ్ రిపోర్ట్ చూపించిందని మెగాస్టార్ ట్విట్టర్ మాధ్యమంగా పంచుకున్న సంగతి విదితమే. 

చిరంజీవికి అనుమానం వచ్చింది కాబట్టి మరో సారి పరీక్షలు చేయించుకున్నారు. కానీ ఇప్పటి వరకు చాలా మంది ఒకసారి టెస్ట్ చేయించుకోగానే ఆ ఫలితాన్ని నమ్ముతున్నారు. ఒకవేళ కరోనా లేకుండా పాజిటివ్ చూపించినా, ఉన్నా నెగటివ్ గా చూపించినా ఆ నష్టం ఖరీదు ఓ ప్రాణం. అందుకే రెండో సారి కూడా టెస్ట్ చేయించుకోవడం మంచిది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox