Breaking News

ప్లాస్మా థెరపీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్రంప్..!

24 th Aug 2020, UTC

వాషింగ్టన్ :అమెరికాలో కూడా కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎట్టకేలకు ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, తొలుత ప్లాస్మా ధెరపీని అక్కడ వినియోగించనప్పటికీ, తాజాగా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా పేషెంట్లకు ప్లాస్మా చికిత్స అందించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ప్లాస్మా థెరపీ ద్వారా విజయవంతంగా చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.

భారత్ లో కూడా ఈ తరహా చికిత్స మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ నేపధ్యంలో అమెరికా కూడా ఈ చికిత్స వైపు మొగ్గు చూపుతోంది. కోవిడ్19 పాజిటివ్‌గా తేలిన పేషెంట్లకు హాస్పిటల్‌లో చేరిన మూడు, నాలుగు రోజుల తర్వాత ప్లాస్మా థెరపీ చేయనున్నారు. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, " చైనా వైరస్ కరోనాను ఎదుర్కోవడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నాం. ఈ చికిత్సకు ఎఫ్ డి ఏ కూడా అనుమతివ్వడం సంతోషకరం. అత్యవసరం అయినా పేషంట్లకు ఇక పై ప్లాస్మా థెరపీ అందుబాటులోకి రానుంది" అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అంతే కాదు, ఈ చికిత్స పై అధ్యయనం కోసం అమెరికా 48 మిలియన్ డాలర్లు వెచ్చిస్తోందని తెలిపారు. ఇప్పటికే పలు దేశాలు ఈ థెరపీ ద్వారా మరణాల రేటు 35శాతాన్ని తగ్గించాయని చెప్పుకొచ్చారు. కోవిడ్19 నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని ట్రంప్ సూచనలు చేసారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox