Breaking News

వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, దాడిశెట్టి రాజాలకు కరోనా పాజిటివ్..!

10 th Sep 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :ఆంధ్రలో కరోనా విస్తరణ ముమ్మరంగా ఉంది. త్వరిత గతిన విస్తరిస్తున్న కరోనాని అదుపులోకి తీసుకురావడం ఇంకా సాధ్యం కావడం లేదు. హెచ్చు సంఖ్యలో ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. వారి జాబితాలో మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు చేరారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, దాడిశెట్టి రాజాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల వీరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది.

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే (ఆళ్ల రామకృష్ణా రెడ్డి)తో పాటు తూర్పు గోదావరి జిల్లా, తుని శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, వీరిద్దరూ కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఆర్కే తండ్రి దశరధ రామిరెడ్డి మరణించడంతో ఆర్కే అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే, ఎవరి ద్వారానో కరోనా సోకి ఉండొచ్చని భావిస్తున్నారు. రెండు వారాలపాటు హోమ్ ఐసోలేషన్ కు వెళుతున్నట్లు ఆర్కే ప్రకటించారు. తనను కలిసిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్కే సూచించారు. మరో వైపు దాడిశెట్టి రాజా, విశాఖలోని ఓ ఆసుపత్రి లో చికిత్స తీసుకోవడానికి వెళ్లారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox