Breaking News

రూమర్స్ నమ్మకండి : బాలు తనయుడు చరణ్

24 th Aug 2020, UTC
రూమర్స్ నమ్మకండి   : బాలు తనయుడు చరణ్

టాలీవుడ్  :గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా నెగటివ్ వచ్చిందంటూ, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ వార్తలపై బాలు తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ఎవరో తన పేరుతొ దుష్ప్రచారం చేశారన్నారు. ఈ వార్తలన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం, ఎస్పీ బాలుగారు ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని తెలిపారు. ఆరోగ్యం కొంత నిలకడగానే ఉంది. నాన్న ఆరోగ్యం గురించి నేనే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తాను పుకార్లు నమ్మొద్దని చరణ్ కోరారు.

ప్రస్తుతం బాల సుబ్రహ్మణ్యంకు ఎంజీఎం వైద్యుల పర్యవేక్షణలో ఎక్మో సపోర్ట్‌తో చికిత్స జరుగుతుంది. ఈ నెల ఐదవ తేదీన ఆసుపత్రిలో చేరిన బాలు అప్పటి నుంచి చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం విషమిస్తుండడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఈ నెల పందొమ్మిది నుంచి ఆయనకు ఎక్మోచికిత్సను మొదలెట్టారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి పాటలు పాడాలని అంతా ఎదురు చూస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox