Breaking News

చైనాలో  సైలంట్ గా కరోనా టీకాలు

27 th Sep 2020, UTC
చైనాలో  సైలంట్ గా కరోనా టీకాలు

చైనా ప్రభుత్వం హై రిస్క్ కేటగిరీ వారిగా భావిస్తున్న డాక్టర్లు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, టీచర్లకు అత్యవసర ప్రాతిపదికన క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోని టీకాను వేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రాకుండా కొన్ని ఒప్పందాలపై వారి సంతకాలు కూడా తీసుకుందని సమాచారందీనిపై అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీకా ప్రభావశీలత, భద్రతపై పూర్తి ఆధారాలు లభ్యం కాకుండానే ఇలా వందల మందిపై ప్రయోగించడం తప్పని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టీకా ఇచ్చేందుకు చైనా ముందస్తు అనుమతి ఏమైనా తీసుకుందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు

అయితే ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు ఉందని చైనా హెల్త్ కమిషన్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం జూలైలో ప్రారంభమవగా జూన్‌లోనే తాము ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు. మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ శాస్త్రవేత్త సౌమ్య విశ్వనాథన్ కూడా దీనిపై స్పందించారు. అత్యవసర ప్రాతిపదికన ప్రభుత్వాలు తమ ప్రజలకు కరోనా టీకాలు ఇవ్వచ్చన్నారు.  ప్రస్తుతం చైనాకు చెందిన మొత్తం 15 వ్యాక్సీన్ల రూపకల్పన వివిధ ప్రయోగదశల్లో ఉంది. వీటిలో నాలుగు టీకాలు ఫేజ్-3 క్లీనికల్ ట్రయల్స్‌కు చేరుకున్నాయి.  మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox