Breaking News

రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ కు కరోనా పాజిటివ్..!

13 th Aug 2020, UTC

అయోధ్య :కరోనా మహమ్మారి మానవాళిని ఇప్పట్లో వదిలేలా లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. తాజాగా, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ కు కరోనాపాజిటివ్ వచ్చింది. ఇటీవలే ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, పాజిటివ్ వచ్చింది.

తొలుత ఆయనకు శ్వాస పరమైన ఇబ్బంది తలెత్తింది. అయితే, కరోనా పరీక్షా చేయగా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయనను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి వేడుక‌ల్లో పాల్గొనేందుకు ఆయన మధుర వెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌ కూడా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ నృత్య గోపాల్ దాస్ కు చికిత్స అందించాలని మ‌థుర డీఎంను కోరారు. అయోధ్య భూమిపూజ జరిగిన వారం రోజులకే, ట్రస్ట్ చీఫ్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా నిర్ధారణ అయింది. ఈ ట్రస్ట్ ఫిబ్రవరి 5 వ తేదీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ప్రధాని మోదీ ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేసారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox