Breaking News

చికెన్ తెచ్చిన కరోనా

13 th Aug 2020, UTC
చికెన్ తెచ్చిన కరోనా

చైనా :చికెన్ లేకుండా మీకు ముద్ద దిగదా? అయితే, మీకో బాడ్ న్యూస్. ఇపుడు చికెన్ వలన కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉండొచ్చని అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం, ప్రపంచం ముందున్న ఏకైక సవాల్ "కరోనా". ఈ మహమ్మారి చైనాలో పుట్టిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి ప్రపంచదేశాలకు వ్యాప్తి చెందింది. అయితే, చైనా అన్ని దేశాల కంటే ముందుగానే కోలుకుంది. కానీ అక్కడ మళ్ళీ కరోనా కేసులు తిరగబెడుతున్నాయి. చైనాలో మళ్ళీ కరోనా ఎలా మొదలైంది? చికెన్ నుంచే కరోనా వచ్చిందా? మనుషుల నుంచి మనుషులకే కాకుండా, కోడి నుంచి కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయా? ఓ సారి చూద్దాం.

కరోనాకు పుట్టిల్లు అయినా చైనా, ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన కేసులతో సతమతమైపోయింది. అయితే,త్వరలోనే కోలుకుంది. మూడు నాలుగు నెలల వ్యవధిలోనే ఒక్క కేసు కూడా లేకుండా, కోలుకుంది. వారం రోజుల్లో ఆసుపత్రి నిర్మించుకోగలిగే సామర్ధ్యం ఉన్న చైనాలోనే ఈ మహమ్మారి అదుపులోకి రావడానికి మూడు నెలల కాలం పట్టింది. అయితే, ప్రపంచ దేశాలన్నిటికి కూడా ఈ మహమ్మారి వ్యాప్తి చెందినా చైనా కోలుకున్నంత త్వరగా ఇతర దేశాలు కోలుకోలేదు. అయితే, చైనాలో కరోనా తగ్గుముఖం పట్టింది అని ఊపిరి పీల్చుకునే లోపే, అక్కడ మళ్ళీ కరోనా కేసులు కనిపిస్తున్నాయి. తాజాగా, బ్రెజిల్‌ నుంచి దిగుమతి చేసుకున్న కోడిరెక్కల మాంసంలో కరోనా పాజిటివ్‌  అక్కడి అధికారులు గుర్తించారు.

ఇప్పటి వరకు చికెన్ తింటే, కరోనా వస్తుందా అనేది అపోహగా మాత్రమే ఉండేది. చికెన్ తినడం వలన కరోనా రాదనీ ఇప్పటికే పలువురు నిపుణులు చెప్పడంతో, ఊపిరి పీల్చుకున్నాం. కానీ, ఇపుడు బ్రెజిల్‌ నుంచి దిగుమతి చేసుకున్న కోడి రెక్కల మాంసంలో కరోనా పాజిటివ్‌ ఉండడం సంచలనం సృష్టిస్తోంది. అనేక అనుమానాలకు ఇది తావిస్తోంది.

మామూలుగానే, త్వరితంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిపై అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయి. చికెన్ లేకుండా చాలా మంది అన్నం తినరు. వారంలో ఒకసారి అయినా సరే చికెన్ తప్పకుండ ఉండాల్సిందే. అయితే, కరోనా వచ్చిన తరువాత పరిస్థితి మారిపోయింది. చికెన్ వలన కరోనా వస్తుందని భయపడి చాలా మంది చికెన్ ను తగ్గించేశారు. అయితే, డబ్ల్యుహెచ్ఓతో సహా పలువురు పరిశోధకులు చికెన్ వలన కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదని చెప్పడంతో, తిరిగి చికెన్ తినడం మొదలెట్టారు. అయితే, అంతలోనే మరో బాడ్ న్యూస్ వచ్చింది.

చైనాలో కోడి రెక్కల మాంసంలో కరోనాని గుర్తించడంతో చికెన్ తినే విషయమై మరింత జాగరూకతతో  వ్యవహరించాల్సి ఉందని తెలుస్తోంది. దక్షిణ చైనా నగరం షెంజెన్‌లో కోడి రెక్కల మాంసంలో కరోనా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. షెంజెన్‌లో స్థానిక రోగనియంత్రణ బృందాలు బ్రెజిల్‌ నుంచి దిగుమతి అయిన చికెన్‌ రెక్కలను పరీక్షించాయి. అయితే, వాటిలో కరోనా ఉందని ఈ బృందాలు నిర్ధారించినట్లు, ప్రముఖ అంతర్జాతీయ వార్త పత్రిక రాయిటర్స్ పేర్కొంది.

జూన్‌ నుంచి దిగుమతి అయిన సీఫుడ్స్‌, మాంసం కన్‌సైన్‌మెంట్లను  కూడా స్థానిక అధికారులు పరీక్షించారు. బ్రెజిల్‌ దిగుమతులకు పక్కనే ఉన్న ఇతర కన్‌సైన్‌మెంట్లపై కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా, వాటికి నెగటివ్ వచ్చింది. దిగుమతి చేసుకున్న మాంసం, సీఫుడ్స్‌ కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు చైనా ఆరోగ్య అధికారులు ప్రకటన చేసారు. అంతే కాకుండా, ఈక్వెడార్‌ నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యలపై జరిపిన పరీక్షల్లో కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు బుధవారం చైనా ప్రకటించింది. ఇవే కాకుండా, ఇతర దేశాల నుంచి వస్తున్న మాంసం, సీఫుడ్స్‌ కంటైనర్స్‌పై చైనా కరోనా పరీక్షలు జరుపుతోంది. ఇలా ఇతర దేశాల నుంచి విడుదల అవుతున్న ఫుడ్ పై పాజిటివ్ వస్తుండడంతో  బ్రెజిల్‌తో సహా పలు దేశాల నుంచి వీటి ఎగుమతులను చైనా నిషేధించింది. అయితే, ఈ వార్తలపై బ్రెజిల్ అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది.

ఎందెందు వెతికిన, అందందే ఉండునట్లు, ఈ మహమ్మారి సర్వత్రా వ్యాపించి ఉంది. తగు జాగ్రత్తలతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దిగుమతి చేసుకున్న వాటిని వినియోగించే ముందు మరో సారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలానే పరిశుభ్రమైన వాతావరణం నుంచే చికెన్ ను కొనుగోలు చేయాలి. శుభ్రమైన ఆహారపు అలవాట్లను కొనసాగించాల్సి ఉంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox