Breaking News

బాలు దగ్గర వంద అప్పు చేశా..: మోహన్ బాబు

24 th Aug 2020, UTC
బాలు దగ్గర వంద అప్పు చేశా..: మోహన్ బాబు

టాలీవుడ్ :ప్రస్తుతం బాలుగారు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయనతో తమకు ఉన్న అనుభవాలను పలువురు  పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా బాలు గారితో తనకు ఉన్న అనుభూతులను పంచుకున్నారు. మోహన్ బాబుకు బాలుగారితో చిన్నప్పటి నుంచే అనుబంధం ఉందట. వారిద్దరూ కాళహస్తిలో బడికి వెళ్లే నాటి నుంచే స్నేహితులుగా ఉండేవారట.

బాలు, మోహన్ బాబుని శిశుపాల, భక్త అంటూ పిలిచే వారు. ఎపుడో ఓ సారి మోహన్ బాబు అని పిలిచేవారట. ఒకసారి ఎపుడో, భోజనానికి డబ్బులు లేక మోహన్ బాబు బాలు దగ్గర వంద రూపాయలు అప్పు చేశారట..ఈ విషయాన్నీ మోహన్ బాబు  ఇటీవల ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పంచుకున్నారు. అయితే, ఇప్పటికీ,  ఆ వంద రూపాయలను మోహన్ బాబు తిరిగి ఇవ్వలేదట.

ఇప్పటికి బాలు సరదాగా ఆ వంద రూపాయల గురించి మోహన్ బాబుని ఆటపట్టిస్తుంటారట. ఏమయ్యా, ఇంకా వంద రూపాయల అప్పు తీర్చలేదు. ఈ పాటికి అది కోటి అయ్యుంటుంది అని అంటూ ఉంటారట. ఆరోజు సంగతులు మోహన్ బాబు గుర్తుచేసుకున్నారు. ఆయన కళ్ళు చెమర్చాయి. ఆ గొంతుతో, ఎందరో దేవతల పాటలు పాడావు. వారందరి ఆశీస్సులతో నువ్వు ఆరోగ్యంగా తిరిగొస్తావు. అని మోహన్ బాబు ఆకాంక్షించారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox