Breaking News

చర్మం ద్వారా కోవ్యాక్సిన్‌ను టెస్ట్ చేయనున్న భారత్ బయోటెక్..!

23 rd Aug 2020, UTC

భారత్ బయో టెక్ వాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వాక్సిన్ కు కోవ్యాక్సిన్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వాక్సిన్ ఫేజ్ 1 , 2 దశలలో ఉంది. ఇప్పటి వరకు ఈ వాక్సిన్ ను వాలంటీర్లకు కండరాల ద్వారా ఇచ్చేవారు. అయితే. తాజాగా, ఈ వాక్సిన్ ను చర్మం ద్వారా ఇవ్వడానికి కూడా అనుమతులు లభించాయి. ఈ మేరకు ఆ కంపెనీకి ఐసీఎంఆర్ అనుమతులు ఇచ్చింది.

అయితే, ఈ ట్రయిల్ ఇప్పటివరకు చేసిన ట్రయల్స్ కంటే భిన్నంగా ఉండనుంది. మామూలుగానే, ఈ వాక్సిన్ తాలూకు ఫలితాలను కూడా విడుదల చేస్తారు. కానీ, వాక్సిన్ ను చర్మం ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు.  కోవ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా 12 చోట్ల 1125 మంది వాలంటీర్లకు ఇచ్చి భారత్ బయోటెక్ పరీక్షిస్తోంది.  ఒక్కో వాక్సిన్ ఖరీదు వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరే ఉంటుందని  ఆ కంపెనీ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల  గతంలోనే ప్రకటించారు. కాగా, వాటర్ బాటిల్ ఖరీదు ఈ వాక్సిన్ కంటే ఐదు రేట్లు ఎక్కువ ఉంటుంది. అయితే, దేశీయ వాక్సిన్ల కంటే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ముందు అందుబాటులోకి రాబోతోందని తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox