Breaking News

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ..!

11 th Jun 2020, UTC

కరోనా మహమ్మారి వ్యాప్తి, పొంచి వున్న ఎపిడమిక్ సీజన్ నేపధ్యంలో ఏపీలో  వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలను భర్తీ  చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. . ప్రజలకు అవసరమైన సేవలందించాలంటే ఆ స్దాయిలో ఉద్యోగులు వుండి తీరాలని సీఎం  భావించారు.  దీనితో రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

 డీఎంఈ, వైద్య విధాన పరిషత్, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో 5,701 పోస్టులు, అలాగే 804 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. మరో 2,186 స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటితో పాటు వివిధ కేటగిరీలలో 1,021 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచి విద్య, వైద్యం, ఆరోగ్యం రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తరువాత   కరోనా వైరస్‌ వ్యాప్తి  నేపధ్యంలో ప్రజా రోగ్య శాఖ పై సమీక్ష నిర్వహించిన సీఎం ప్రజలకు మెరుగైన సేవలందించడానికి   తగిన స్దాయిలో సిబ్బంది  లేరని గమనించారు.  దీంతో  ఆయాశాఖా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఎం జగన్‌.. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని . వీలైనంత త్వరగా ఖాళీలను గుర్తించి.. నోటిఫికేషన్‌ విడుదల చేయాలని గత సమీక్షా సమావేశంలో సూచించారు

 సీఎం ఆదేశాలతో అలర్ట్‌ అయిన వైద్యారోగ్యశాఖ ఖాళీలను గుర్తించి వాటికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు నెలల్లోనే జగన్ నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసారు. గ్రామ స్దాయిలో వాలంటీర్లు, గ్రామ , వార్డు స్దాయిలో సచివాలయ ఉద్యోగులను నియమించారు. ఇలా వుండగా కరోనా క్లిష్ట సమయంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox