Breaking News

హైదరాబాద్ కు చేరిన 3.72 లక్షల కరోనా టీకా డోసులు..!

12 th Jan 2021, UTC

హైదరాబాద్ :ఈరోజు ఉదయం కరోనా వైరస్ వాక్సిన్ డోసులను సప్లై చేస్తున్నట్లు పూణే ఎయిర్పోర్ట్ అధికారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఒక్కో గమ్యస్థానానికి కరోనా వాక్సిన్ డోసులు చేరుతూ వస్తున్నాయి. కొద్దీ సేపటి క్రితం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా కరోనా వాక్సిన్ డోసులు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం పూణే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.

మొత్తం 31 బాక్సులలో 3.72 లక్షల కరోనా టీకా డోసులను తీసుకువచ్చినట్లు సమాచారం. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక కంటైనర్లలో వీటిని తరలిస్తున్నారు. ఇప్పటికే వాక్సిన్ ను భద్రపరచడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసారు. 44 క్యూబిక్ మీటర్ సామర్ధ్యంతో ఉండే ఫ్రీజర్లను వాక్సిన్ ను భద్రపరచడం కోసం ఏర్పాటు చేసారు. ఇక్కడినుంచి అన్ని జిల్లాలకు వాక్సిన్ లను తరలించనున్నారు.

మొదటి విడతలో, 2.9 లక్షల హెల్త్ వర్కర్లకు వాక్సిన్ ను వేయనున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆక్స్ ఫర్డ్ తో కలిసి ఐసీఎమ్ఆర్ భాగస్వామ్యంలో వాక్సిన్ ను రూపొందించింది. జులై వచ్చేసరికి అందరికి సరిపడా వాక్సిన్ ను ఉత్పత్తి చేయగలమని సీరం ఇన్స్టిట్యూట్ గతంలోనే ప్రకటన చేసింది. మరో వైపు.. ఏపీకి కూడా 4.7 లక్షల కరోనా టీకా డోసులను పంపించనున్నారు. జనవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు.  మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox