Breaking News

సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ లకు 100 శాతం అడ్వాన్స్ చెల్లింపు

20 th Apr 2021, UTC

భారతదేశంలోని ఇద్దరు కోవిడ్ వ్యాక్సిన్ తయారీదారులకు జూలై వరకు కేంద్రం 100 శాతం అడ్వాన్స్ ఇచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ వర్గాలు తెలిపాయి. సీరం ఇన్స్టిట్యూట్ (కోవిషీల్డ్‌ను ఉత్పత్తి ) కోసం రూ. 3,000 కోట్లు మరియు భారత్ బయోటెక్ (కోవాక్సిన్‌ను ఉత్పత్తి ) కోసం, రూ.1,500 కోట్లు చెల్లించినట్లు  సమాచారం.

గత వారం కేంద్రం భారత్ బయోటెక్ కు  రూ.65 కోట్లు మంజూరు చేసింది. ఇది కోవాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించబడింది. ముడి పదార్థాలను కొనడం, సిబ్బందికి చెల్లించడం మరియు వ్యాక్సిన్ మోతాదులను తయారు చేయడం మరియు పంపిణీ చేయడం వంటి ఉత్పత్తిని పెంచడానికి ఎస్ ఐ ఐమరియు భారత్ బయోటెక్  కు నిధుల కొరత లేకుండా కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఇటీవల పలు రాష్ట్రాలు తమ వద్ద టీకాల నిల్వలు తగ్గిపోయినట్లు అందోళన వ్యక్తం చేసాయి.పంజాబ్ తమ వద్ద  మూడు రోజుల స్టాక్ మాత్రమే ఉందని కేంద్రానికి తెలిపింది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కూడతమ వద్ద టీకా నిల్వలు అయిపోయినట్లు పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో మహారాష్ట్ర ముంబై, పూణేలతో సహా 100 కి పైగా టీకా కేంద్రాలను మూసివేయవలసి వచ్చింది.

ఈ నెల ప్రారంభంలో, సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావల్లా  పూణేలోని తన ప్లాంట్లో ఉన్న ఉత్పత్తి సామర్థ్యం వత్తిడికి గురయిందని తెలిపారు. జూన్ నాటికి ఉత్పత్తిని పెంచడానికి తనకు మూడు నెలల సమయం, మరియురూ. 3,000 కోట్లు అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు తయారీదారుల నుండి నేరుగా వ్యాక్సిన్లను కొనుగోలు చేయవచ్చు;మిగిలిన 50 శాతం కేంద్రానికి  ఇవ్వాలి.అమ్మకపు ధరను మించకుండా తయారీదారులు తమ స్టాక్‌లో సగం రాష్ట్రాలకు (లేదా బహిరంగ మార్కెట్లో) విక్రయించడానికి అనుమతించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox