Breaking News

మణిపూర్ లో కోవిడ్ -19 జీవనోపాధి పధకం రూ.5,000 సాయం అందిస్తామన్న సీఎం బిరెన్ సింగ్

25 th Aug 2021, UTC

కంరోనావైరస్ ద్వారా  జీవనోపాధిని కోల్పోయిన వారిని ఆదుకునే ప్రయత్నంలో, మణిపూర్ ప్రభుత్వం ఒక కొత్త  పథకాన్ని ప్రారంభించింది. ఇంఫాల్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ ఈ పధకాన్ని ప్రారంభించారు. మణిపూర్‌లో కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా దెబ్బతిన్న ప్రతి ఒక్కరికీ రూ .5,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. జిల్లా స్థాయిలో సమగ్ర సర్వే ద్వారా దరఖాస్తులను ఆహ్వానించామని, ఇప్పటివరకు మొత్తం 22,336 దరఖాస్తులు వచ్చాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. 

వచ్చిన 22,336 దరఖాస్తులలో 7,943 దరఖాస్తులను ఆమోదించారు. మొదటి విడత 6,276 దరఖాస్తుదారులకు రూ. 2,500 చొప్పున  అందజేస్తారు. రెండవ దశ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అందిస్తామని ఆయన పేర్కొన్నారు. స్టార్ట్-అప్ స్కీమ్ కోసం సుమారు 6,000 దరఖాస్తులు గుర్తించామని వీటికి  వీలైనంత త్వరగా రుణాలను అందిస్తామని సీఎం తెలిపారు.

మణిపూర్‌ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ వ్యవధిని సెప్టెంబర్ 6 వరకు పొడిగించింది. రాత్రి కర్ఫ్యూ సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంది.రాష్ట్రంలో సామాజిక సమావేశాలు మరియు విందులు ఇప్పటికీ నిషేధించబడ్డాయి. స్థానిక సంస్థల సహాయంతో రాష్ట్రంలోని మైక్రో కంటైన్‌మెంట్ జోన్‌లను పోలీసులు మరియు ఆరోగ్య శాఖ బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox