Breaking News

పస్తులు ఉండి చస్తాం కానీ జొమాటో లో పనిచేయం

28 th Jun 2020, UTC

కోల్ కతా లోజొమాటో ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ వినూత్నంగా తమ దేశ భక్తికి చాటుకున్నారు. పస్తులు ఉండి చస్తాం కానీ, చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీలో పనిచేయమంటూ ఉద్యోగాలు వదులుకున్నారు.  లద్దాఖ్‌ గల్వాన్‌ లోయలో జరిగిన చైనా దాడిలో 20 మంది భారత సైనికులు మృతి చెందిన  తరువాత దీంతో దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక ఉద్యమాలు మొదలయ్యాయి.

 చైనా వస్తువులను బ్యాన్‌ చేయాలని, ఎవరూ వాడకూడదని ప్రముఖులు సైతం పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాకు చెందిన కొందరు జొమాటో బాయ్స్‌ అక్కడి బెహాలా వద్ద వినూత్నంగా నిరసనలు తెలియజేసి తమ దేశ భక్తిని చాటుకున్నారు.

జొమాటో అధికారిక టీషర్టులను ఓ చోట కుప్పగా పోసి తగలబెట్టారు. అనంతరం జొమాటోలో చైనా పెట్టుబడులు ఉన్నాయని, దీని ద్వారా ఆహార పదార్థాలు ఆర్డర్‌ చేయవద్దని పిలుపునిచ్చారు. తమ ఉద్యోగాలను వదిలేస్తున్నట్లు తెలిపారు

. చైనా.. భారత దేశం నుంచి ఆదాయం పొందుతూ దేశ సైనికులపై దాడి చేస్తోందని, భారత భూభాగాన్ని సొంతం చేసుకోవటానికి ప్రయత్నిస్తోందని.. అలా జరగకుండా చేయాలని అన్నారు. పస్తులు ఉండి చస్తాం కానీ, చైనా పెట్టుబడులు ఉన్న వాటిలో పనిచేయమని తేల్చిచెప్పారు.  

Read latest ఆహార | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox